పెరుగు కమ్మగా...
close
Published : 26/04/2021 00:28 IST

పెరుగు కమ్మగా...

పెరుగు లేకుండా భోజనం పూర్తికాదు చాలామందికి. ఈ కాలంలో త్వరగా పులిసిపోతుంది. అలాకాకుండా ఉండాలంటే...

* పాలను బాగా మరిగించాలి. తోడు వేయడానికి ఉపయోగించే పెరుగు పుల్లగా లేకుండా చూసుకోవాలి.  వేడి పాలల్లో కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే పెరుగు కలిపి మూత పెట్టాలి. దీన్ని మరీ స్టౌకి దగ్గరగా పెట్టొద్దు. పెరుగును మట్టిపాత్రలో లేదా సిరామిక్‌ గిన్నెలో తోడు పెడితే...గట్టిగా తోడుకుంటుంది. కమ్మగానూ ఉంటుంది.
* సాధారణంగా మర్నాడు తినడానికి రాత్రి, మధ్యాహ్నానికి ఉదయాన్నే తోడు పెడతారు. అలాకాకుండా భోజనం తినేవేళకు ఐదారు గంటల ముందు ఇలా చేస్తే సరి. ఆపై వెంటనే ఫ్రిజ్‌లో పెడితే రుచి మారదు. పెరుగు గిన్నెపై మూత తప్పనిసరి. మూత లేకపోతే మిగతా పదార్థాల వాసనలు పెరుగులో కలిసిపోయి కూడా త్వరగా పులిసిపోయే అవకాశం ఉంటుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని