తేలిగ్గా పెంచేసుకోండి!
close
Published : 26/04/2021 00:28 IST

తేలిగ్గా పెంచేసుకోండి!

ఏ కూరలో అయినా దింపేముందు కాస్త కొత్తిమీర వేస్తే.. ఆ రుచే రుచి! లస్సీలు, ఇతర పానీయాల్లోనూ పుదీనా, తులసి, కొత్తిమీర అందించే తాజాదనమే వేరు. కానీ.. వీటిని ఎప్పటికప్పుడు దొరికేలా పెంచుకోవడం కష్టమని అనుకుంటారు! కానీ చిన్న చిట్కాలతో సాధ్యం చేసుకోవచ్చు. చేసి చూడండి.

* వీటన్నింటినీ మార్కెట్‌ నుంచి కొమ్మలతోనే తెచ్చుకుంటాం. వాటిని కాండం కింది భాగంలో కొద్దిగా 45 డిగ్రీల కోణంలో కత్తిరించాలి. అడుగు భాగంలో ఉండే ఆకులను తుంచేయాలి.
* కప్పులు, గాజు గ్లాసులు ఇలా వేటిలోనైనా నీటిని పోసి ఖాళీగా ఉన్న కాడ భాగం మునిగేలా చూసుకోవాలి. కుళాయి నీరు, వడపోసిన నీరు ఏదైనా ఫర్వాలేదు. వీటిని ఎండ బాగా తగిలేచోట ఉంచుకోవాలి. రెండు వారాల తర్వాత గమనించండి. సన్నటి వేర్లు రావడం కనిపిస్తుంది. రోజూ నీటిని పోయాలి. అలాగే కాస్త పచ్చగా కనిపించగానే మార్చడమూ మర్చిపోవద్దు.
* వేర్లు కొంచెం మందం అయ్యాక కుండీల్లోకి మార్చుకోవచ్చు. కావాల్సినప్పుడల్లా ఆకులను తాజాగా కోసేసుకుంటే సరి!

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి