ఏ మేకప్‌కి ఏ బ్రష్‌?
close
Updated : 28/04/2021 02:12 IST

ఏ మేకప్‌కి ఏ బ్రష్‌?

వేడుక చిన్నదైనా, పెద్దదైనా.. కాస్త మేకప్‌ టచ్‌ లేనిదే మన సింగారం పూర్తవదు. అన్నింటికీ ఒకేరకమైన తయారీ అసలే కుదరదు. వేడుకను బట్టి మార్పులు. మరి బ్రష్‌ల సంగతేంటి అంటారా? మీకోసమే ఈ సూచనలు.

* ఫౌండేషన్‌ బ్రష్‌: మేకప్‌ బేస్‌కి ఇదే ప్రధానం. ఫౌండేషన్‌ను చుక్కలుగా ముఖమంతా పెట్టుకుని, ఈ బ్రష్‌తో హెచ్చుతగ్గులు లేకుండా సరిచేసుకోవచ్చు.

* స్టిఫెనింగ్‌ బ్రష్‌: దీనిలో రెండు సైజ్‌లుంటాయి. చిన్నదాన్ని కళ్లకింద, నోరు, ముక్కు దగ్గర ఉపయోగించొచ్చు. పెద్దదాన్ని బుగ్గలు, దవడ ప్రాంతాలకు వాడుకోవచ్చు.

* కాంటూరింగ్‌: బుగ్గలు, ముక్కు, దవడ ప్రాంతాల హైలైటింగ్‌కు ఉపయోగపడుతుంది.

* పౌడర్‌ బ్రష్‌: బ్లష్‌ కోసం దీన్ని వినియోగించొచ్చు. ఇది ముఖమంతా సమంగా పరుచుకునేలా చేస్తుంది.

* ఫ్యాన్‌ బ్రష్‌: ఇది ముఖంపై ఎక్కువైన మేకప్‌, పౌడర్‌ను తీసేయడానికి సాయపడుతుంది. హైలైటర్‌గానూ వినియోగించొచ్చు.

* లిప్‌స్టిక్‌ బ్రష్‌: బోర్డరింగ్‌కీ, తర్వాత దాన్ని పెదవుల మొత్తానికి విస్తరించుకోవడానికీ ఇది తప్పనిసరి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి