బరువు తగ్గించే ఉలవలు!
close
Published : 28/04/2021 01:32 IST

బరువు తగ్గించే ఉలవలు!

ఉలవల్లో ఎన్నో పోషకాలున్నాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ బోలెడు ప్రయోజనాల్ని ఇస్తాయి. అవేంటో చూద్దాం రండి..

లవల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్‌, పాస్ఫరస్‌లతో పాటు బోలెడంత పీచు పదార్థమూ లభిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు వీటిని రోజూ చారుగా కానీ, స్నాక్స్‌గా కానీ తీసుకోవచ్చు.
* ఉలవలు, కొత్త బియ్యం సమానంగా తీసుకుని జావ చేసుకుని తాగితే కాల్షియం లభిస్తుంది. ఎముకలకు, కండరాలకు కూడా శక్తి అందుతుంది. గాయాలు త్వరగా మానడానికి ఉలవలు తోడ్పడతాయి.
* ఉలవల్లోని పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీంతో జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. ఆకలి పెరుగుతుంది. వీటిని ఎదిగే పిల్లలు తింటే చాలా మంచిది.
* ఉలవలతో రుతుక్రమ సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు.

కొబ్బరి నీళ్లలో ఐదారు కర్బూజ ముక్కలు, నాలుగైదు పుదీనా ఆకులు, రెండు కమలా తొనలు వేసిన పానీయాన్ని తీసుకుంటే గ్రీష్మ తాపం తగ్గుతుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి