మూడో నెల నుంచి జుట్టు రాలడం?
close
Published : 29/04/2021 00:24 IST

మూడో నెల నుంచి జుట్టు రాలడం?

వయసు 35 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం బాబు పుట్టాడు. వాడు పుట్టిన మూడో నెల నుంచి జుట్టు రాలడం మొదలైంది. ఇప్పుడు చాలా పలుచబడి పోయింది. ఎన్ని చిట్కాలు పాటించినా ఫలితం లేదు. ఈ సమస్య తీరేదెలా? దీనికేమైనా మందులున్నాయా?  - ఓ సోదరి, ఆర్మూరు
రోజుకు 50 వెంట్రుకలు ఊడటం సాధారణమే. 100కి మించితే అప్పుడు చికిత్స తీసుకోవాలి. చాలావరకూ నెమ్మదిగానే ప్రారంభమవుతుంది. దీనికి రకరకాల కారణాలుంటాయి. ప్రెగ్నెన్సీ సమయం, ఆ తర్వాత, పీసీఓఎస్‌, రుతుక్రమం సరిగా లేకపోవడం.. జుట్టు ఊడటానికి కారణమవుతాయి. థైరాయిడ్‌, పోషకాహారలోపం, సర్జరీలు,  రక్తహీనత వల్లా ఊడుతుంది. కొన్ని రకాల మెడికేషన్‌.. డిప్రెషన్‌, రక్తపోటు గర్భనిరోధక మాత్రల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఐరన్‌, జింక్‌, బి6, బి12 తగ్గినా ఊడుతుంది. రసాయనాలు, స్ట్రయిటనింగ్‌, ఒత్తిడి, సరైన ఆహారం, వ్యాయామం లేకపోవడం, క్రానిక్‌ ఇల్‌నెస్‌ కూడా కారణమే.
డైట్‌లో విటమిన్‌ డి, ఎ, జింక్‌, ఐరన్‌లు ఉండే చిలగడదుంప, క్యారెట్‌, గుమ్మడికాయ, పాలకూర, పాలు, గుడ్లు, విటమిన్‌ సి ఉండే స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, బత్తాయి, నారింజ, బెల్‌ పెప్పర్‌, జామ, ఉసిరి, విటమిన్‌ ఇ కోసం పొద్దుతిరుగుడు గింజలు, బాదం, పాలకూరను బాగా తీసుకోవాలి. పప్పు ధాన్యాలు, ఆల్మండ్స్‌, మీట్‌, ఫిష్‌, కూరగాయల్లో ఉండే బయోటిన్‌ జుట్టుకు చాలా మంచిది. కొత్త ఫాలికల్స్‌ తయారీలో ‘డి’ కీలకం. దీనికోసం చేపలు, కార్డ్‌లివర్‌ ఆయిల్‌, మష్రూమ్స్‌ వంటివి తీసుకోవాలి.
ఒత్తిడికి దూరంగా ఉండాలి. ధ్యానం చేయాలి. ఎక్కువ వేడిలో తిరగడం, వేడి నీటితో తలస్నానం కారణంగానూ జుట్టు పాడవుతుంది. డ్రయర్లు వాడకూడదు. తడి జుట్టును దువ్వకూడదు. సహజంగానే ఆరబెట్టాలి. గాఢతగల షాంపూలు వాడటం, ఎలాస్టిక్‌ హెయిర్‌ బ్యాండ్లతో జుట్టును లాగి కట్టడం చేయొద్దు. కండిషనర్‌ పెట్టుకోవాలి. అప్పుడు జుట్టు పాడవదు. వ్యాయామం, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన జుట్టు సొంతమవుతుంది. ఇవన్నీ చేసినా సమస్య ఉంటే.. ఐరన్‌కోసం  సప్లిమెంట్లూ, ఫోలిక్‌ యాసిడ్‌, బయోటిన్‌ 10గ్రా. ఒమేగా 3, 6 ఫ్యాటీ ఆసిడ్లూ సాయపడతాయి. కొందరికి ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా థెరపీ (పీఆర్‌పీ) చికిత్సనిస్తాం. రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ను వేరుచేసి, స్కాల్ప్‌కు ఇంజెక్ట్‌ చేయడం ద్వారా కూడా జుట్టు పెరుగుదలను వృద్ధి చేయొచ్చు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి