ఆ ఐదు అతిశుభ్రంగా!
close
Published : 29/04/2021 00:24 IST

ఆ ఐదు అతిశుభ్రంగా!

అనారోగ్యాలు, ఇన్‌ఫెక్షన్లు తాండవం చేస్తున్న వేళ పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలి. ముఖ్యంగా వంటగదిని  శుభ్రంగా, క్రిమిరహితంగా పెట్టుకోవాలి..

వంటింట్లో... కూరగాయలు కడగడం, కోయడం, పాత్రలు శుభ్రం చేయడం... ఇలా రకరకాల పనులన్నీ దీని చుట్టుపక్కలే చేస్తుంటాం.  దీనిపై బోలెడు సంఖ్యలో సూక్ష్మజీవులు ఆవాసం ఉంటాయి. కాబట్టి ఈ బండను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. డిటర్జెంట్‌ కలిపిన నీటితో శుభ్రం చేసి పొడి వస్త్రంతో తుడవాలి.

సింకు... జిడ్డు పాత్రలు, మిగిలిపోయిన ఆహార వ్యర్థాలు.... ఇలా చూడటానికి చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది. ఇక్కడే పాత్రలు శుభ్రం చేస్తాం.  అయితే దీన్ని కూడా ఎప్పటికప్పుడు కడిగేయాలి. వెనిగర్‌, వంటసోడాలను సమాన పరిమాణాల్లో తీసుకుని వేడినీటిలో కలపాలి. ఈ నీటిలో స్పాంజ్‌ను ముంచి దాంతో సింకుని శుభ్రం చేయాలి.

ఫ్రిజ్‌... పదార్థాల కోసం దీన్ని పదే పదే తెరుస్తున్నప్పుడు మన చేతికి ఉండే క్రిములన్నీ ఫ్రిజ్‌ డోర్‌పై ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఇదిలా కొనసాగితే కొత్త ఇబ్బందులు తప్పవు. కాబట్టి రెండు మూడు రోజులకోసారి ఫ్రిజ్‌ శుభ్రత విషయంలో కాస్త పట్టించుకోవాలి. ఓ పాత్రలో కొన్ని నీళ్లు పోసి అందులో చెంచా ఉప్పు లేదా వంటసోడా కలపాలి. ఈ నీటిలో శుభ్రమైన వస్త్రాన్ని ముంచి ఫ్రిజ్‌నంతా తుడవాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడిస్తే సరి.

మసిబట్ట... వంటగదిలో నిరాదరణకు గురయ్యే వస్తువుల్లో మసిబట్టను చెప్పొచ్చు.  దీనిపై క్రిముల సంఖ్యను చెప్పలేం. ఇవి చూడటానికి మాములుగా కనిపించినా పూర్తిగా హానికారక బ్యాక్టీరియాతో నిండి ఉంటాయి. కాబట్టి రోజూ ఉతకాల్సిందే. వేడినీటిలో కాస్తంత డిటర్జెంట్‌ వేసి ఉతికితే క్రిములు చనిపోతాయి. మురికీ పోతుంది.

చెత్త బుట్ట... ఇది సూక్ష్మజీవులకు అడ్డా. కాబట్టి దీని కవరును ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. గోరువెచ్చటి నీటిలో కాస్తంత డిటర్జెంట్‌, డెటాల్‌ వేసి బాగా కడిగితే సరి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి