దబ్బపండు... పోషకాలు మెండు
close
Updated : 30/04/2021 02:02 IST

దబ్బపండు... పోషకాలు మెండు

దబ్బపండులో ఇమ్యూనిటీని పెంచే పోషకాలున్నాయి. నిమ్మ, నారింజ, పంపరపనస పండ్లలో ఉండే అన్ని గుణాలూ ఈ ఒక్క పండులోనే మెండుగా ఉన్నాయ్‌! అవేంటో రుచిచూడండి...

బ్బపండులో యాంటీఆక్సిడెంట్స్‌ ఎక్కువ. అందుకే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులూ చెబుతున్నారు. దబ్బకాయ రసాన్ని రోజూ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల జలుబు, దగ్గువంటి వ్యాధులు దరిచేరవు.
* దబ్బకాయ షర్బత్‌ చాలా మంచిది. వాంతులు, దప్పిక, నోటిపూత, చిగుళ్ల వాపులు తగ్గిపోతాయి. దబ్బకాయలో ఉండే విటమిన్‌ సి, మెటబాలిజం మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.
* చాలామంది మహిళలకు, ముఖ్యంగా పిల్లలకి కడుపులో నులిపురుగులు చేరి ఇబ్బందిపెడతాయి. అలాంటప్పుడు దబ్బ రసంలో వాము, జీలకర్ర కలిపి తీసుకుంటే వాటికి చెక్‌ పెట్టొచ్చు. ఈ పండును రోజూ తింటే జుట్టు బాగా పెరిగి, రాలే సమస్య నియంత్రణలోకి వస్తుంది. త్వరగా తెల్లజుట్టు రాకుండా ఆపుతుంది.


చిట్కా

 

పచ్చి ఉల్లిపాయ చలవ చేస్తుందని కూరలు, పచ్చళ్లలో నంజుకోవడం మామూలే! ఎండలో వెళ్లేటప్పుడు సాక్సులో ఉల్లిపాయ ముక్క పెట్టుకుంటే వడదెబ్బ బారినుంచి తప్పించుకోవచ్చు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని