ఆ భయం పోయేదెలా?
close
Updated : 30/04/2021 02:04 IST

ఆ భయం పోయేదెలా?

నేనో కార్పొరేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాను. అన్ని విషయాల్లోనూ ఎంతో ధైర్యంగా ఉంటాను. ఎంతోమంది అమ్మాయిలకు ఆదర్శంగా ఉండే నాకు ఓ ఫోబియా ఉంది. బొద్దింకలు, బల్లుల్లాంటి వాటిని చూస్తే వణికిపోతాను. నా భయాన్ని చూసిన నా కొలీగ్స్‌ నవ్వుతున్నారు.. ఎగతాళి చేస్తున్నారు. ఈ భయాన్ని ఇక పోగొట్టుకోలేనా?

- సోదరి

లాంటి భయాలు చిన్నప్పుడే మొదలవుతాయి. బల్లులు, సాలీళ్లు, బొద్దింకలు హాని చేయవు. కానీ అవంటే కొందరికి జుగుప్స. కొందరు కుక్కలు, పిల్లులకు భయపడతారు.  ఇది యానిమల్‌ ఫోబియా లేదా ఫోబిక్‌ యాంగ్జయిటీ డిజార్డర్‌. పెద్దవాళ్లు జబ్బులొస్తాయనో, మరేదో చెప్పడంవల్ల వాటికి తమ ఆలోచన తోడై భయపడటాన్ని కండిషనింగ్‌ అంటారు. పెద్దలు అవేమీ చేయవు, పట్టించుకోవద్దని చెప్పి చిన్నప్పుడే సరిచేయాలి. లేకపోతే ఆ భయంతో పనిమీద మనసు లగ్నం చేయలేరు, నవ్వులపాలవుతారు. కనుక సైకియాట్రిస్టును కలవాలి. యాంటీ డిప్రెసెంట్‌ మెడిసిన్లను రోగికి అనుకూలమైన డోసులో ఇస్తారు. దాంతోపాటు బిహేవియర్‌ మాడిఫికేషన్‌ టెక్నిక్స్‌ అనే సైకలాజికల్‌ ట్రీట్‌మెంట్‌లో ఆందోళన తగ్గించే రిలాక్సేషన్‌ టెక్నిక్‌ నేర్పిస్తారు. తర్వాత సిస్టమాటిక్‌ డీ సెన్సిటైజేషన్‌.. అంటే ఏ జీవివల్ల ఎలా భయపడుతున్నారో ఆ పరిస్థితిలోకి వారిని ప్రవేశపెట్టి భయాందోళనలను పుట్టించి తగ్గించుకునేలా చేస్తారు. ఇలా కాగ్నెటివ్‌ థెరపీ ద్వారా సమస్య అదుపులోకి వస్తుంది. ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవడం కూడా నేర్పిస్తారు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి