కళ తెచ్చే కొబ్బరి ప్యాక్‌...
close
Published : 02/05/2021 00:52 IST

కళ తెచ్చే కొబ్బరి ప్యాక్‌...

కాలం ఏదైనా చర్మం కాంతిమంతంగా మెరిసిపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం కొంత సమయం కేటాయిస్తే చాలు అవేంటంటే...
చర్మానికి తగిన తేమ అందినప్పుడే తాజాగా కనిపిస్తుంది. అందుకే కాలం ఏదైనా స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్‌ తప్పకుండా రాసుకోవాలి. ఎప్పుడైనా పొడిబారినట్లు కనిపిస్తే కలబంద గుజ్జులో కొద్దిగా తేనె, ఆలివ్‌ నూనె కలిపి చర్మానికి రాసుకుని ఆరనివ్వండి. ఆపై నీళ్లతో కడిగేసుకోండి. ఇలా తరచూ చేస్తుంటే సమస్య దూరమవుతుంది.
* టొమాటోలో ఉండే లైకోపిన్‌ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతుంది. దీన్ని గుజ్జుగా చేసుకుని చెంచా పాలపొడి, చెంచా కొబ్బరి గుజ్జు, పంచదార, తేనె కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని మృదువుగా రుద్దితే మృతకణాలు తొలగి చర్మం కాంతిమంతంగా మారుతుంది.
* గ్రీన్‌టీలో చెంచా బాదం నూనె, కొద్దిగా తేనె, రెండు చెంచాల ఉలవపిండి కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక ఓ సారి చేతుల్ని తడిపి సవ్య, అపసవ్య దిశల్లో మర్దన చేయాలి. ఇలా ఓ ఐదు నిమిషాలు చేశాక కడిగేసుకుంటే సరి. తక్కువ సమయంలో మీ ముఖం కళగా కనిపిస్తుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని