మరపు దూరమవ్వాలంటే..
close
Published : 02/05/2021 00:52 IST

మరపు దూరమవ్వాలంటే..

‘అబ్బా.. మళ్లీ మర్చిపోయాను..’ ‘అరెరె... ఇందాక కూడా అనుకున్నా!’

ఇంట్లో ఆడవాళ్ల నుంచి వచ్చే మాటలే ఇవి. సమయంతో పోటీపడుతూ పనులు పూర్తిచేసేటపుడు ఇలాంటివి సహజమే. కానీ.. తరచూ జరుగుతోంటే? జాగ్రత్త పడాల్సిందే. అందుకు ఈ చిట్కాలను పాటించండి.
చాలాసార్లు... తప్పక గుర్తుంటుందనుకున్నదీ మర్చిపోతుంటాం. ఇలాంటప్పుడు పని/ విషయం చిన్నదైనా, పెద్దదైనా ఒకచోట రాసిపెట్టుకోవాలి. గుర్తుందా మంచిదే. లేదంటే ఈ జాబితా గుర్తు చేస్తుంది. రాసినది మెదడులో ముద్రలా పడుతుంది. ఇదీ లాభమే.
* సరిగా నిద్రలేకపోయినా ఈ సమస్య ఎదురవుతుంది. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఉద్యోగినులైతే పనివేళల తర్వాత విశ్రాంతి కోసం టీవీల్లోనో, మొబైల్స్‌లోనో వీడియోలు చూడటం పరిపాటి. కానీ ఇది అంత  మంచి అలవాటు కాదంటున్నారు. అందులోనూ నిద్రపోయే ముందు వీడియోలు చూడటం మెదడుపై ప్రభావం చూపుతుంది. దానివల్ల గాఢనిద్ర ఉండదు.
* కొంతమంది రాత్రివేళ తగ్గిన నిద్రను ప్రయాణాల్లో భర్తీ చేస్తుంటారు.  ఉదయం సరే కానీ సాయంత్రం నిద్ర మంచిది కాదు.
* రోజులో క్రమం తప్పకుండా కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. మెదడుకు రక్తప్రసరణ సరిగా జరగడంలో ఇది సాయపడుతుంది. గంటల తరబడి కుర్చీకి పరిమితవకుండానూ చూసుకోవాలి. సరైన సమయానికి ఆహారాన్నీ తీసుకోవాలి.
* శక్తికి మించిన పనులను పెట్టుకోవద్దు. చెప్పిన సమయంలోగా ఎంతవరకూ చేయగలుగుతారో దాన్నే ప్రయత్నించండి.
* మతిమరుపునకు ఒత్తిడి కూడా కారణమే. సకాలంలో పని పూర్తి చేయకపోవడమూ ఇందుకు కారణమవుతుంది. కాబట్టి, ఒక ప్రణాళిక ప్రకారం పనులు పూర్తయ్యేలా చూసుకోవాలి. ఎక్కువ మోతాదులో కాఫీనీ తీసుకోవద్దు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి