ఈ నైపుణ్యాలనూ నేర్చేసుకోండి!
close
Published : 04/05/2021 00:30 IST

ఈ నైపుణ్యాలనూ నేర్చేసుకోండి!

అమ్మాయిలనగానే చాలావరకూ బుద్ధిగా చదవడమే గుర్తొస్తుంది. కానీ ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించాలంటే మార్కులొక్కటే సరిపోవు. నైపుణ్యాలూ కావాలి. అలాగని సాంకేతికమైన వాటికే పరిమితమవొద్దు. సాఫ్ట్‌ స్కిల్స్‌కీ ప్రాధాన్యమివ్వాలి. వాటిలో కొన్ని..

కమ్యూనికేషన్‌: అతి ముఖ్యమైన, రంగంతో సంబంధం లేకుండా అవసరమయ్యే నైపుణ్యం. ఒక వ్యక్తిపై మొదటి అభిప్రాయాన్ని కలిగించేదీ ఇదే! ఎదుటివారితో మాట్లాడేతీరు, తేలిగ్గా కలిసిపోవడం, మెప్పించడం అన్నీ దీనికిందకే వస్తాయి. వీటిని మాటద్వారానే కాక రాతపరంగానూ అభివృద్ధి చేసుకోవాలి.
బృందంగా పనిచేయడం: హోంవర్క్‌కీ, ఆఫీసు పనికీ చాలా తేడా ఉంటుంది. మొదటి దానిలో ఇచ్చినదాన్ని సక్రమంగా చేసేస్తే సరిపోతుంది. రెండోదాన్నీ సరిగానే చేయాలి కాకపోతే.. మిగతావారితో పాటుగా, వారిని కలుపుకొంటూ చేయాలి. మీ పని త్వరగా పూర్తయితే పక్కవారికి సాయం చేయడం లాంటివి చేయాలి. ఇది మీపై సానుకూల అభిప్రాయాన్నీ ఏర్పరుస్తుంది.
నాయకత్వం: ఆడవారిలో సహజంగానే ఈ నైపుణ్యం ఉంటుందంటున్నాయి కొన్ని అధ్యయనాలు. దీనికీ హోదాకీ సంబంధమేమీ లేదు. నలుగురినీ కలుపుకొంటూ వెళ్లడం, ఓపికగా ఉండటం, ఎదుటివారి అభిప్రాయాలకి గౌరవమివ్వడం, ప్రశ్నించడం వంటివి దీనిలో భాగంగా చెప్పొచ్చు. ఉదాహరణకు-  ఒక విషయాన్ని అందరూ ఒకేలా, అంతే వేగంతో అర్థం చేసుకోలేరు. సమయం పడుతుంది. అలాంటప్పుడు ఓపికతో వ్యవహరించడం, అవసరమైతే సాయం చేయడం.. ఇవన్నీ నాయకత్వం కిందకే వస్తాయి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి