అందానికి సున్నిపిండి!
close
Published : 04/05/2021 00:30 IST

అందానికి సున్నిపిండి!

అమ్మమ్మల కాలం నాటి... సౌందర్య సాధనం నలుగుపిండి. అందుబాటులో ఉండే పదార్థాలతో సులువుగా చేసుకోవచ్చు. దీంతో ప్రయోజనాలూ ఎక్కువే!

సెనగ, పెసర, ఉలవ, బియ్యప్పిండులను సమపాళ్లల్లో తీసుకోండి. దానికి చెంచా గంధం, రెండు చెంచాల గులాబీ రేకల పొడి, కొద్దిగా కమలాతొక్కల పౌడర్‌ వేసి కలిపిన మిశ్రమాన్ని గాలి చొరని సీసాలో భద్రపరుచుకోండి. స్నానం చేయడానికి ముందు కొద్దిగా తీసుకుని చెంచా ఆలివ్‌ నూనె కలిపి ఒంటికి రాసుకుని మర్దన చేస్తే ఫలితం ఉంటుంది. చర్మంపై మృతకణాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది.  
* కప్పు పెసరపిండిలో కాస్త పసుపు, తులసి, కమలాఫల తొక్కల పొడి చేసి కలపాలి. దీనికి కొద్దిగా బాదం నూనె కలిపి నలుగులా పెట్టుకుంటే సరి.  యాంటీ ఫంగల్‌, బ్యాక్టీరియల్‌గా పనిచేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మచ్చలు లేకుండా చేసి చర్మచాయని పెంచుతాయి. కమలాఫలం తొక్కల పొడి, గులాబీరేకల మిశ్రమం వంటివాటిల్లోని విటమిన్‌ ఎ, సిలు చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచుతాయి
* వట్టివేళ్ల పౌడర్‌ చర్మంపై ఉండే టాన్‌ని తొలగిస్తుంది. కొద్దిమోతాదులో ఉపయోగించే పచ్చకర్పూరం సువాసన మనసుని, మెదడుని తేలికపరుస్తాయి. దీన్ని బియ్యప్పిండిలో కొద్దిగా కలిపి రాసుకుని స్నానం చేస్తే సరి. హాయిగా నిద్రపడుతుంది. ఇక దీన్ని ఒంటికి పట్టించేప్పుడు వాడే నువ్వుల నూనె రక్తప్రసరణ సక్రమం చేస్తుంది. చర్మానికి నిగారింపు తెచ్చిపెడుతుంది.


ఈ కాలంలో పుచ్చకాయ, ముంజలు , కర్బూజాలతో చేసిన షర్బత్‌లను తాగితే డీహైడ్రేషన్‌ సమస్యలు దూరమవుతాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని