అలా అంటే కోపం వస్తోంది!
close
Updated : 04/05/2021 03:58 IST

అలా అంటే కోపం వస్తోంది!

నేను ఇంటర్‌ చదువుతున్నాను. మా అమ్మ ఇళ్లల్లో పనిచేస్తుంది. నన్ను పనిమనిషి కూతురనడం నచ్చక అమ్మ మీద కోపం వస్తోంది... తన తప్పు లేదనీ, నేనిలా చేయకూడదని తెలిసినా... నన్ను నేను మార్చుకోవడం ఎలా?

- ఒక సోదరి

టీనేజ్‌ అమ్మాయిలు తమ ఉనికి, గుర్తింపు, కుటుంబం గురించి గొప్పగా వ్యక్తం చేసుకోవాలనుకుంటారు. ఆ వయసులో పోటీ తత్వం ఉంటుంది. అందర్నీ ఆకర్షించాలని ఉంటుంది. నీక్కూడా అందరూ నిన్ను ఉన్నతంగా చూడాలి, ఆదరించాలనే ఊహ ఉండి ఉంటుంది. అది తప్పేం కాదు. కానీ మనం ఎక్కడ పుట్టామనేది ముఖ్యం కాదు. పేదస్థితి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్లెందరో ఉంటారు. మీ అమ్మ చదువుకోకపోయినా ఉన్నతాదర్శంతో వేరే పిల్లలతో సమానంగా నిన్ను చదివిస్తున్నందుకు గౌరవించాలి. కష్టపడి పనిచేసి లాభం పొందారంటే అది మంచి సంగతి. ఎక్కణ్ణించి వచ్చినా మన ఉనికిని మనమే చాటుకోవాలి. ఇతరుల మాటలు సవాలుగా తీసుకుని చక్కగా చదువు. ధ్యాసను మరో అంశం మీదకు మళ్లించి ఇంకొకరికి ఆదర్శమయ్యేలా నిలబడు. ఇక్కడ నువ్వు అవమానపడాల్సింది, మీ అమ్మను తప్పుపట్టాల్సిందీ ఏమీ లేదు. నీ స్నేహితులు ఒకవేళ హేళన చేసినా వాళ్లకోసం నువ్వు వెనక్కి వెళ్లనవసరంలేదు. ఉదాహరణకు కలాం నిరుపేద స్థితి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు. అలాంటివాళ్లెందరో ఉన్నారు. కనుక కులం, వృత్తి కాదు, మేధస్సు ముఖ్యం. కుంగిపోవాల్సిన పనే లేదు, గర్వంగా తలెత్తుకుని ఎవర్నీ పట్టించుకోకుండా నీ లక్ష్యం దిశగా వెళ్లు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి