నెలసరి నొప్పి తగ్గిస్తుంది!
close
Published : 05/05/2021 00:35 IST

నెలసరి నొప్పి తగ్గిస్తుంది!

మళ్లీ కరోనా విజృంభిస్తోంది. శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో అల్లం చక్కగా పనిచేస్తుంది. ఇది ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. మరి దీన్నెలా వాడొచ్చో తెలుసుకుందామా?
అల్లం వికారాన్ని తగ్గిస్తుంది. శరీర బరువుని తగ్గించడంలోనూ కీలకంగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, శ్వాస ఇబ్బందులను నియంత్రిస్తుంది. ఈ కాలంలో జలుబు బారిన పడకుండా ఉండటానికి ఇది బాగా పనిచేస్తుంది. అల్లం ముక్కల్ని నీళ్లల్లో వేసి మరిగించి దానికి చెంచా తేనె కలిపి తాగితే మేలు.  
* నెలసరి సమయంలో అల్లం తీసుకోవడం వల్ల అప్పుడు వచ్చే నొప్పులు నియంత్రణలో ఉంటాయట. అధిక రక్తస్రావాన్ని అరికట్టే సుగుణాలు దీనిలో ఉన్నాయని చెబుతున్నాయి పరిశోధనలు. కీళ్ల నొప్పులకూ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది.
* ఆయుర్వేదం ప్రకారం అల్లానికి రక్తపోటుని నియంత్రించే శక్తి ఉంది. కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్‌ సంబంధిత సమస్యల్ని అదుపులో ఉంచుతుంది. రోజూ ఉదయాన్నే చిన్న అల్లం ముక్కను నూరి, నిమ్మరసం, పంచదార కలిపిన నీళ్లను తీసుకోండి. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి