నూనెలతో నిగారింపు!
close
Published : 15/05/2021 00:39 IST

నూనెలతో నిగారింపు!

చిన్నప్పుడు నలుగుతో పాటు నూనెల్ని రుద్దేవారు. ఇప్పుడు మనకంత తీరికెక్కడిది? చర్మం నిగారింపుతో మెరిసిపోవాలంటే... నూనెలతో మర్దన అవసరం.

అదెలాగో తెలుసుకుందామా?

బాదం: ప్రొటీన్లూ, మినరల్స్‌ అధికంగా ఉండే ఈ నూనెలో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాయడం వల్ల ముఖం ఎప్పుడూ తేమతో తొణికిసలాడుతుంది.


ఆముదం: దీనిలోని ప్రొటీన్లు జుట్టుతోపాటూ చర్మానికి మేలు చేస్తాయి. కొబ్బరినూనెతో కలిపి రాస్తే చర్మానికి కూడా తగినంత తేమ అందుతుంది. జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.


కొబ్బరినూనె: ముఖం మీద పేరుకున్న బ్యాక్టీరియాని తొలగించే గుణం కొబ్బరినూనెకి ఉంది. మేకప్‌ని సులువుగా తొలగించే క్లెన్సర్‌.  
సన్‌ఫ్లవర్‌:  దీన్ని సాధారణంగా మనమంతా వంటలకే ఉపయోగిస్తాం కానీ... ఇది చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అన్నిరకాల చర్మాల వారికి ఇది ఉపయోగపడుతుంది.

దానిమ్మ గింజల నూనె: ఎండ కారణంగా ఏర్పడిన నల్లని మచ్చలని అదుపులో ఉంచుతుంది. చర్మ క్యాన్సర్లు రాకుండా నివారించే శక్తి ఈ నూనెకి ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్‌టీతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిలోని యాలిజిక్‌ యాసిడ్‌కి ప్రసవం తర్వాత ఏర్పడే స్ట్రెచ్‌మార్క్స్‌ని నివారించే గుణం ఉంది.


చిటికెడు గంధాన్ని స్నానం చేసే నీళ్లలో కలిపితే ఒళ్లు పేలకుండా ఉంటుంది.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి