ప్రణాళిక ఉందా?
close
Published : 15/05/2021 00:43 IST

ప్రణాళిక ఉందా?

చదువు, పెళ్లి, పదవీ విరమణ... ఈ విషయాల్లో మనందరికీ ఎంతో కొంత ముందస్తు ఆర్థిక ప్రణాళిక ఉంటుంది. మరి గర్భధారణ, పుట్టబోయే బిడ్డ గురించి కూడా ఇలాంటి ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌తోనే ముందుకెళ్తున్నారా? లేకపోతే ఆ దిశగా కూడా ఆలోచించండి. ఎందుకంటే..
అసోచామ్‌ నివేదికల ప్రకారం... 25 శాతం మంది ఉద్యోగినులు తల్లైన తర్వాత అనేక రకాల ఒత్తిళ్లతో తమ ఉద్యోగాలకు స్వస్తి చెప్పాల్సి వస్తోంది. కెరీర్‌లో వచ్చిన ఈ కుదుపు ఆర్థికంగా వెనకడుగు వేసేలా చేసి.. వాళ్లపై ఒత్తిడిని పెంచుతోంది. ముఖ్యంగా తడిసిమోపెడయ్యే డెలివరీ బిల్లులు, పిల్లల వ్యాక్సిన్‌ ఖర్చులు, డైపర్‌ ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దీనికి ముందస్తు ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి అంటున్నారు ఆర్థిక నిపుణులు.
‘ఆలూ లేదు.. చూలూ లేదు..’ అనే సామెతని గుర్తుచేసుకుని పిల్లలు ఇంకా పుట్టకుండానే వాళ్ల ఖర్చు గురించి ఎలా ఆలోచిస్తాం? అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఆ ముందుచూపు లేకనే చాలా యువజంటలు పిల్లలు పుట్టిన మొదటి రెండు, మూడు సంవత్సరాల్లో తీవ్రమైన ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారట.
అందుకనే పిల్లల్ని కనాలన్న ఆలోచన రాగానే ప్రతినెలా కొంతమొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మందులు, ఆసుపత్రి బిల్లులు, వ్యాక్సిన్‌ ఖర్చులు, డైపర్ల ఖర్చుని దృష్టిలో పెట్టుకుని సొమ్ముని జమ చేస్తుంటే... మెటర్నిటీ లీవులు అయిపోయిన తర్వాత కూడా ఇంట్లోనే ఉండాల్సి వచ్చినా అంతగా ఒత్తిడి ఉండదు. ఇందుకు సిప్‌(సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లోకానీ, ఆర్‌డీలోకానీ డబ్బుని పెట్టుబడిగా పెట్టడం మంచి పద్ధతి అంటున్నారు నిపుణులు. మంచి బీమా పథకాన్ని ఎంచుకుంటే ప్రసవం ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి