ఒకేసారి అన్ని పనులా?
close
Published : 15/05/2021 00:48 IST

ఒకేసారి అన్ని పనులా?

మహిళలు ఇటు ఇంటిపనులు చక్కదిద్ది,  భర్త, పిల్లల అవసరాలు తీర్చి...కుటుంబ బాధ్యతలు చూసుకుంటారు. అటు ఉద్యోగ విధులూ నిర్వర్తిస్తుంటారు. ఈ క్రమంలో పనులు సకాలంలో పూర్తవ్వాలన్న ఆలోచనతో మల్టీటాస్కింగ్‌ చేస్తుంటారు. అయితే దీనివల్ల ఒత్తిడి ఎక్కువ, ఉత్పాదకత తక్కువ అంటున్నారు నిపుణులు...
ఒకే సమయంలో వేర్వేరు పనులు పూర్తి చేయాలనే ఆలోచన మంచిదే కానీ...ఇలా అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. కొన్నిసార్లు మల్టీటాస్కింగ్‌ చేయగలిగినా...పరిపూర్ణంగా అవుతాయా అన్నది సందేహమే! ఉదాహరణకు గ్యాస్‌ మీద పప్పు వేసి, కుక్కర్‌లో రైస్‌ పెట్టి మిగిలిన పనులు చూసుకోవచ్చు.  అయితే ఓ పక్క పిల్లాడిని చదివించడం, మరోపక్క వంట, ఇంకోవైపు ఆఫీసు ఫోన్‌కాల్స్‌...వంటివన్నీ ఒకేసారి చేయాలనుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది. బదులుగా ప్రణాళిక ప్రకారం కాస్త వేగంగా ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయండి. కాస్తయినా సమయం మిగులుతుంది.  
* ఒక్కరే అన్ని పనులూ ఒకేసారి చేయాలనుకోవడం వల్ల ఒత్తిడికి గురవుతారు. కాలక్రమంలో ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంది. త్వరగానూ అలసిపోతారు. కుటుంబ సభ్యులకు అప్పగించే పనులు ఏవైనా ఉంటే... వారికి అప్పజెప్పడంలో తప్పులేదు.
* కొందరు మొహమాటానికి పోయి...ఇతరుల పనులూ నెత్తిన వేసుకుని చేస్తుంటారు. తరచూ ఇలాంటి అదనపు బాధ్యతల్ని తీసుకుంటే కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అది ఏదైనా సరే...మీ పనులు పూర్తయ్యాకే...అనే నియమం పెట్టుకోండి.  దీనివల్ల మల్టీటాస్కింగ్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి