వెన్నునొప్పి బాధిస్తోందా?
close
Published : 16/05/2021 00:41 IST

వెన్నునొప్పి బాధిస్తోందా?

చాలామంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా నిత్యం కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేస్తున్న వారిలో ఇది ఎక్కువ. దీన్నుంచి విముక్తి పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం రండి..  
పనిచేస్తున్నప్పుడు ఒకే భంగిమలో బిగుసుకుపోయి కూర్చోవద్దు. అలాగే కుర్చీలో వంగిపోయి కూర్చుంటే వెన్నుపూసపై భారం పడుతుంది. నిటారుగా, తిన్నగా కూర్చోవాలి. అప్పుడే వెన్నుపూసకి విశ్రాంతి దొరుకుతుంది.
* కంప్యూటర్‌ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేస్తే వెన్నునొప్పి ఎక్కువ అవుతుంది. అందుకని మధ్య మధ్యలో విరామం తీసుకోండి. శరీరానికి విశ్రాంతి అవసరం అని గ్రహించండి. పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూండండి. దీనివల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
* వెన్ను నొప్పి మరీ ఎక్కువగా వస్తుంటే కాస్త గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి, టవల్‌ను నీటిలో ముంచి, పిండాక దానితో వెన్నుపూసమీద కాపడం పెట్టండి. కొంతసేపటికి ఊరట కలుగుతుంది.
* ఆవనూనెలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వేడి చేయండి. తర్వాత ఆ నూనెని చల్లార్చి వెన్నుపూస మీద మర్దనా చేయండి. వెన్ను నొప్పి తగ్గుతుంది.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి