మన ప్రాతినిధ్యం ఇంతేనా?
close
Published : 16/05/2021 00:41 IST

మన ప్రాతినిధ్యం ఇంతేనా?

ఇంకెన్నాళ్లు ?

ఏదైనా చెప్పాలనుకుంటే మగవాళ్లతో చెప్పు.... ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఆడవాళ్లతోనే చెప్పు.. అంటుంది ఐరన్‌ లేడీ మార్గరెట్‌ థాచర్‌. చేతల్లో మనమేంటో నిరూపించుకోవాలంటే రాజకీయాలను మించిన వేదిక లేదు. ఈ రంగంలో మన వాటా పెరుగుతోందా? తగ్గుతోందా? ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలనే తీసుకుందాం.. బెంగాల్‌ బెబ్బులి మమత విజయం మనకి ఆనందమే. మరి ఆ స్ఫూర్తి... అన్ని చోట్లా ఉందా?
11  కేరళలో మహిళలు కైవసం చేసుకున్న అసెంబ్లీ సీట్ల సంఖ్య ఇది. గత ఎన్నికల్లో ఇది 8. అంటే కాస్త పెరిగాయి! సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి, 21 ఏళ్ల వయసులోనే తిరువనంతపురం మేయర్‌గా ఎంపికై దేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన ఆర్యా రాజేంద్రన్‌ వంటి వారే ఈ మార్పునకు కారణం కావొచ్చు.
40 కాళీమాతను పూజిస్తూ... స్త్రీశక్తికి ప్రాధాన్యత ఇచ్చే పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో గెలిచిన మహిళల సంఖ్య ఇది. ఈ సారి పెద్ద   మార్పు లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో 41 మంది గెలిచారు మరి!
12 మంది... తమిళనాడు అసెంబ్లీలో కాలుపెట్టనున్న మహిళా ఎమ్మెల్యేలు. ఈసారి ఆ సంఖ్య ఆ బాగా తగ్గిపోయింది! పోయిన సారి 21 మంది విజేతలయ్యారు!  
6 అసోం నుంచి ఆరుగురు మహిళలు అసెంబ్లీలో తమ గొంతు వినిపించనున్నారు. గతంలో ఈ సంఖ్య 8. పుదుచ్చేరిలో ఒకే ఒక్క మహిళ గెలిచారు.
ఈ సంఖ్య పెరిగేదెప్పుడు? చట్టాల రూపకల్పనలో మనకు తగిన ప్రాతినిధ్యం దక్కేదెప్పుడు?

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి