బంజర్లో బంగారం పండించింది!
close
Published : 16/05/2021 00:41 IST

బంజర్లో బంగారం పండించింది!

ఊహ తెలియని వయసులోనే పెళ్లి... ప్రపంచాన్ని అర్థం చేసుకునేలోపే పెనిమిటి అకాల మరణం.. నలుగురు బిడ్డల పెంపకాన్ని తలకెత్తుకుని ఒంటరిగా జీవిత పోరాటం మొదలుపెట్టింది వన్నూరమ్మ.. నేడు ప్రధాని ప్రశంసలు అందుకుంది...
న్నూరమ్మది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామం. చిన్నవయసులోనే వివాహం చేసుకున్న వన్నూరమ్మ మొదట ఏడో తరగతి వరకే చదివింది. కానీ ఇరవై సంవత్సరాల తర్వాత చదువుపై మక్కువ పెంచుకున్నారు. తన పిల్లలతో పాటు చదివి 2010లో పదో తరగతి పరీక్షలు రాశారు. తర్వాత కదిరిలో డిగ్రీ పూర్తి చేశారు. 2007లో దురదకుంటలో గ్రామ సంఘానికి ఎంపికయ్యారు. 2007లో గ్రామ సంఘం లీడరుగా, అనంతరం మండల సమాఖ్య లీడరుగా మూడేళ్లు పని చేశారు. బీమామిత్రగా కంబదూరు, కుందుర్పి, శెట్టూరు మండలాల్లో పని చేశారు. సీఎస్‌పీగా ఎనిమిది సంవత్సరాలు పని చేశారు. వీటన్నింటికంటే తాతల నాటి బంజరు భూమిని సాగులోకి తీసుకొచ్చి బంగారు పండించడం మొదలు పెట్టారామె. ప్రభుత్వం ఇచ్చిన నాలుగున్నర ఎకరాల భూమి అది. ‘అమ్మానాన్నలకు ఒక్కదాన్నే కూతుర్ని కావడంతో ఆ భూమిని నాకు ఇచ్చారు. అంతకు ముందు బీడుగా ఉన్న ఆ భూమిలో పంటలు సాగు ఎలా చేసుకోవాలో తెలియని పరిస్థితి. అయినా పట్టుదలతో ఎన్నో విషయాలు నేర్చుకుని మహిళా రైతుగా విజయవాడలో అవార్డు అందుకున్నాను. ఆర్డీటీ ఆధ్వర్యంలో అమెరికా  ప్రభుత్వ అవార్డునీ అందుకున్నా’ అని వివరించారు వన్నూరమ్మ.  
కష్టం సాగిందిలా...
అనంతపురంలో వర్షాలు తక్కువ కాబట్టి ప్రకృతి వైపు మొగ్గు చూపారు వన్నూరమ్మ. ‘ప్రకృతి వ్యవసాయ డీపీఎం లక్ష్మానాయక్‌ గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న బంజరు భూములను పరిశీలించారు. ఆయన ప్రోత్సహించి ఈ భూముల్లో ప్రకృతి వ్యవసాయం చేయమని ధైర్యం చెప్పారు. అప్పటి నుంచి బీడు భూమును బాగు చేసేందుకు ఒంటరిగానే కృషి చేశాను’ అంటారు వన్నూరమ్మ. 2018లో మొదటిసారి నవధాన్యాలు, వేరుసెనగ, కూరగాయల పంటలు సాగు రూ.27వేలు ఖర్చు చేసి ఏడాదిలో మూడు పంటలు రాగా సుమారుగా రూ.1.07 లక్షలు లాభం వచ్చింది. రెండో సంవత్సరంలో కూడా వేరుసెనగ, కూరగాయలు పంటలు సాగు చేస్తే రూ.1.50 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం నవధాన్యాలు సాగు చేశారు. తను చేయడంతోపాటు నియోజకవర్గంలోని వంకతండా గ్రామంలో 170 మంది మహిళలను ప్రోత్సహించి వారితో 220 ఎకరాల భూమిలో ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నారు. ఇప్పుడు వారంతా ఆరోగ్యకరమైన పంటలు సాగు చేస్తున్నారు. ఈ విషయాలు అధికారుల ద్వారా తెలుసుకున్న ప్రధాని మోదీ శుక్రవారం దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడి వన్నూరమ్మను ప్రశంసలతో ముంచెత్తారు.

దేశ ప్రధానితో మాట్లాడతానని కలలో కూడా అనుకోలేదు. దేశానికే ఆదర్శంగా ఉండి మహిళల సత్తాచాటి చెప్పావని ప్రధాని అనడం అదృష్టం. 200 మంది మహిళలతో ప్రకృతి వ్యవసాయం చేయించి నాలా ప్రశంసలు అందుకునేలా చేయాలని నిర్ణయించుకున్నాను. కలెక్టర్‌తో మాట్లాడినప్పుడు కూడా ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తే ప్రభుత్వం అందించే భరోసా కూడా అక్కర్లేదని చెప్పాను. ఎందుకిలా అన్నావని ఆయన అడిగారు. ప్రకృతిసేద్యంతో ఎవరిపై ఆధారపడకుండా వ్యవసాయం చేసుకోవచ్చని తెలిపాను.

- కునిగిరి రమేష్‌, కళ్యాణదుర్గం గ్రామీణం

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి