Pavani Kotrike: ఈ అమ్మాయి ప్రేమకథలు చెబుతోంది!
close
Updated : 18/05/2021 08:54 IST

Pavani Kotrike: ఈ అమ్మాయి ప్రేమకథలు చెబుతోంది!

ఆ అమ్మాయికి బొమ్మలు వేయడం అంటే ప్రాణం. అందులో పట్టు సాధించడం కోసం ఎంతో కష్టపడింది. ఇంటా బయటా తన బొమ్మలు చూసి అందరూ అబ్బురపడేవారు. ఆ రంగంలో నిలదొక్కుకుంటున్న సమయంలో హైదరాబాదు నగరానికి రావాల్సి వచ్చింది. ఇక్కడ తన సృజ్ఞనాత్మకకు మెరుగుపెట్టుకుంది. కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంది. బొమ్మలేకాదు సంగీతం, యాంకరింగ్‌పై తనకున్న ఇష్టాన్ని జోడించి రెండు రంగాల్లో దూసుకుపోతోంది. స్వయంకృషితో జీవితాన్ని వర్ణరంజితంగా మలుచుకుంటున్న యువతరంగం 27ఏళ్ల పావని కొట్రికెతో వసుంధర మాట్లాడింది...

ర్నూల్‌లో  పుట్టి పెరిగిన పావని తండ్రి వ్యాపారి. తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనాలు వేయడమంటే చాలా ఇష్టం. హైస్కూల్‌లో ఈమె ఆసక్తిని గుర్తించిన డ్రాయింగ్‌ మాస్టారు ప్రత్యేకంగా పావనికి ఈ కళలో మెలకువలు నేర్పేవారు. చదువులోనూ ముందుంటుంది కాబట్టి అమ్మానాన్నలూ ప్రోత్సహించే వారు. కాలేజీలో తోటి విద్యార్థినులను చూస్తూ తను గీసే బొమ్మలకు అభిమానులెక్కువ. ఆ తర్వాత బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైనార్ట్స్‌లో చేరినా, అక్కడి విద్యావిధానం నచ్చక కొద్దిరోజుల్లోనే మానేసింది. అయినా చిత్రకళలో పట్టు సాధించాలని అందులో టీచర్‌ కోర్సును పూర్తిచేసింది.

పెన్సిలంటే ఇష్టం!
ముఖకవళికల నుంచి శరీరఛాయ వరకు షేడ్స్‌ అన్నింటినీ తేవడానికి తను పెన్సిల్‌నే వాడుతుంది. ఎదుటి వారిని నిమిషాల్లో పెన్సిల్‌తో స్కెచ్‌ గీసేసేది. కర్నూల్‌లోని గిఫ్ట్‌షాప్స్‌లన్నింటిలో 20 ఏళ్ల వయసు నుంచే తాను గీసిన బొమ్మలను విక్రయానికి ఉంచేది. వాటికి గిరాకీ పెరుగుతున్న సమయంలో వినయ్‌తో పెళ్లి జరిగింది. అలా మూడేళ్లక్రితం హైదరాబాద్‌కు వచ్చింది. ఇక్కడంతా కొత్త! మరేం చేయాలి? అప్పుడు తాను వేసిన బొమ్మలన్నింటినీ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేయడం మొదలుపెట్టింది. వాటికి అభినందనలు వెల్లువెత్తడమే కాదు, ‘మా ఫొటో పంపుతాం, బొమ్మ గీస్తారా’ అని అడగడం మొదలుపెట్టారు. అలా దేశవ్యాప్తంగా చాలామందికి పావని గీసి పంపేది. మరికొందరు చిత్రకళాకారుల స్టైల్‌ను గమనించి, తనకంటూ ఓ ప్రత్యేకతనూ కల్పించుకుంది. ప్రముఖులు, నటీనటుల బొమ్మలను గీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసేది. తక్కువ కాలంలోనే పావనికి అభిమానులు పెరిగారు. తనకి ప్రయోగాలంటే ఇష్టం. అందుకే వీడియో తీయడం నేర్చుకుంది. బొమ్మ గీస్తున్నప్పుడు తనే వీడియో తీసుకుని దాన్ని సంబంధితులకు పంపుతుంది. దీన్ని అదనపు కానుకగా భావించి మురిసిపోతారు చాలామంది. క్రమంగా ఈ కళనే కెరీర్‌గా మార్చుకుంది.

‘తెలుగు కథలు’ పేరుతో
ఇన్‌స్టాగ్రాంలో ఒకమ్మాయి కథలు చెప్పడం చూసిన పావని పాడ్‌కాస్టింగ్‌ గురించి తెలుసుకుంది. గతేడాది ఈ కమ్యూనిటీలోకి అడుగుపెట్టింది. చిన్నప్పటి నుంచి సంగీతం, యాంకరింగ్‌పై ఉన్న ఆసక్తిని ఈ దిశగా మార్చుకుని, కొంత సాధన చేసింది. తాను చెప్పాలనుకున్న కథలకు ‘తెలుగు కథలు’ అని పేరు పెట్టింది. తొలి ఆడియోగా వినయ్‌తో జరిగిన పెళ్లిచూపుల నుంచి మొదలైన తన ప్రేమకథను చెప్పడం మొదలు పెట్టింది. ‘మ్యాట్రిమోనీ లవ్‌’ పేరుతో గూగుల్‌ పాడ్‌కాస్ట్‌లో చెబుతూ, మధ్యమధ్య తన తీయని గొంతుతో పాడిన పాటలనూ చేరుస్తుంది. ‘వారానికి నాలుగైదు నిమిషాల నిడివితో ఒక్కొక్క ఎపిసోడ్‌ను తీర్చిదిద్దేదాన్ని. స్క్రిప్టు నేనే రాసుకుని వినిపించే నా ప్రేమకథకు అద్భుత స్పందన వచ్చింది. అలా పది ఎపిసోడ్స్‌ అయ్యేసరికి ఈ సిరీస్‌ పెద్ద హిట్‌ అయ్యింది. దాంతో దీన్ని కొనసాగించాలనుకున్నా. కొన్ని ప్రేమకథలు రాసి చెప్పేదాన్ని. దాంతోపాటు ఆసక్తి ఉన్నవారి నుంచి కూడా ప్రేమకథలను ఆహ్వానించడం మొదలుపెట్టా. వాటినీ పాడ్‌కాస్ట్‌ చేస్తున్నా. కొన్నైతే 15 ఎపిసోడ్స్‌పైగా అవుతున్నాయి. ప్రస్తుతం ‘ఏం మాయచేశావే’ సిరీస్‌ చెబుతున్నా. ఓ యూట్యూబ్‌ఛానెల్‌ నా ‘తెలుగు కథలు’ను ప్రసారం చేస్తామంటూ ఆహ్వానించింది. ఇదేకాకుండా నాలుగునెలల క్రితం ‘పావనితో కబుర్లు’ పేరుతో పలు సామాజికపరమైన అంశాలు, సినిమా రివ్యూలు, తదితర అంశాలను పాడ్‌కాస్ట్‌ చేస్తున్నా. ఇది నా రెండో కెరీర్‌. ఇప్పుడు వీటన్నింటితో సమయం సరిపోవడంలేదు. హైదరాబాద్‌ వచ్చిన మూడేళ్లలోనే నా సృజనాత్మకతను మెరుగుపరుచుకుని ఆర్థికంగానూ నిలదొక్కుకున్నాననే తృప్తి ఉంది. గతేడాదిలో లాక్‌డౌన్‌లో మావారికి జీతంలో 25 శాతం మాత్రమే ఇచ్చేది. ఇప్పుడూ అదే పరిస్థితి. ఇటువంటి క్లిష్టసమయాల్లో కూడా నా అభిరుచి నన్ను నిలబెడుతోంది. కొవిడ్‌ బాధితులకు చేయూతనందించే దిశగా రూ..1000కే పెయింటింగ్‌ వేస్తానని సోషల్‌మీడియాలో చిన్న ప్రకటన ఇచ్చా. నా లక్ష్యం రూ.25,000. రెండురోజుల్లోనే 25మంది తమ ఫొటోలను పంపి గీయమంటూ నగదునూ పంపించారు. చాలా సంతోషం కలిగింది. ఆ Ÿసొమ్మును పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందించా. ఇప్పటివరకు వెయ్యి దాకా బొమ్మలు గీసి ఉంటా. అయితే నా మొదటి చిత్రలేఖనానికి వచ్చిన రూ.600ను, అలాగే నెలన్నరపాటు కష్టపడి వేసిన అమ్మవారి బొమ్మను మరవలేను. ‘ఓబేబీ’ సినిమా పోస్టరును పెన్సిల్‌తో గీసి సమంతకివ్వడమూ నాకో మధుర జ్ఞాపకం.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి