బెల్లంతో వడదెబ్బకు చెక్‌
close
Published : 20/05/2021 00:58 IST

బెల్లంతో వడదెబ్బకు చెక్‌

బెల్లాన్ని వంటకాల్లో మాత్రమే వాడుతుంటాం. కానీ అసలు రోజూ చిన్న బెల్లం ముక్క తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు. మహిళలకు మరీ మంచిది..
బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వేసవిలో బెల్లం పానకం తాగితే శరీరం చల్లబడి వడదెబ్బ, నీరసం వంటివి తగ్గుతాయి.
* రోజూ పాలల్లో పంచదార బదులు బెల్లం వేసుకుని తాగితే ఎముకలు బలంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులున్న వాళ్లు రోజూ బెల్లంలో అల్లం ముక్కని కలిపి తింటే నొప్పులు మాయమవుతాయి.
*  బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కదా! అదే రోజూ బెల్లాన్ని తింటే, చక్కగా బరువు తగ్గుతారు. ఎందుకంటే ఇది కొవ్వుని కరిగిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో రుతుక్రమ సమస్యలు తగ్గిపోతాయి. బెల్లంలో ఐరన్‌ శాతం ఎక్కువ. కాబట్టి రక్తహీనతతో బాధపడే మహిళలు తప్పనిసరిగా తీసుకోవాలి.
*  బెల్లంలో ఐరన్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌, సోడియం, ఫోలిక్‌ యాసిడ్‌ ఉండటంవల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీన్ని నువ్వులతో కలిపి తింటే ఆస్తమా, బ్రాంకైటిస్‌ లాంటి సమస్యలు దూరం అవుతాయి.


 

ఎండకు తలనొప్పిగా అనిపిస్తోంటే ఆముదంలో కాస్త కొబ్బరినూనె, కొన్ని మెంతుల వేసి మరిగించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాడుకు రాసి మర్దనా చేస్తే ఉపశమనం లభిస్తుంది. వేడి తగ్గుతుంది.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి