అందుబాటులోనే అందం!
close
Published : 22/05/2021 01:21 IST

అందుబాటులోనే అందం!

ఎప్పుడైనా ముఖం కాస్త కళ తగ్గితే ఐ బ్రోస్‌, ఫేషియల్‌, పెడిక్యూర్‌, మెనిక్యూర్‌... చేయించుకునే వారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశం లేదు. అలాగని బాధపడక్కర్లేదు. ఇంట్లోని వస్తువులతోనే సొబగులద్దుకోవచ్చు.
* ఐ బ్రోస్‌ పెరిగినట్టయితే ఎలక్ట్రికల్‌ పెన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. లేదంటే ట్వీజర్స్‌నీ ఎంచుకోవచ్చు. అయితే సరిగా తీయడం రాకపోతే దీనివల్ల చర్మం రాపిడికి గురవుతుంది. కాస్త ప్రాక్టీస్‌ చేస్తే త్రెడ్డింగ్‌ సులువుగానే ఉంటుంది. ఇందుకోసం ఎలక్ట్రికల్‌ త్రెడ్డర్స్‌ని వాడొచ్చు.
* ఫేషియల్‌గా పాలు, తేనె కలిపి ఫేస్‌ప్యాక్‌లా చేసుకుంటే సరిపోతుంది. పసుపులో రోజ్‌ వాటర్‌ కలిపి కూడా ట్రై చేయవచ్చు. ఓట్స్‌, తేనె, ఆలివ్‌ ఆయిల్‌ను మిశ్రమంగా తీసుకుని ముఖంపై నెమ్మదిగా మర్దన చేయాలి. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల వేసవిలో చర్మం నిగారింపు కోల్పోదు.
* ఒక టబ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఎప్సమ్‌ సాల్ట్‌, కొన్ని చుక్కల కొబ్బరినూనె వేసి కాళ్లు పెట్టాలి. పాదాల సంరక్షణకు ఇది ఉపయోగపడుతుంది. సెనగపిండి, పాలు, పసుపు, తేనె కలిపి పేస్టులా చేసి కాళ్లకు ప్యాక్‌లా వేయాలి. పదినిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను చేతులకు కూడా వేసుకోవచ్చు.


వేసవి గంజిలో కాస్త పల్చటి మజ్జిగ, చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగితే డీహైడ్రేషన్‌ సమస్య ఉండదు. శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి