నిలబడే నడవొచ్చు!
close
Published : 22/05/2021 01:29 IST

నిలబడే నడవొచ్చు!

అందంగా కనిపించాలన్నా... ఒత్తిడి, అనారోగ్యాలకు దూరంగా ఉండాలన్నా... వ్యాయామం అవసరం. కానీ కాసేపు కూడా సమయం కేటాయించలేం అంటారు చాలామంది. అలాంటి వారి కోసమే ఇది....
రోజూ పొద్దునే సమయం కేటాయించలేకపోతే అసలు వ్యాయామమే మానేయొద్దు. రోజులో మీకు వీలున్నప్పుడు ఓ అరగంట కేటాయించుకోండి. లేదంటే పావుగంట చొప్పున వీలున్నప్పుడు నాలుగు సార్లు చేయండి. క్రమంగా నడకకు అలవాటు పడతారు.  
*వేగంగా నడిస్తే మంచిదే... అలాగని ఒక్కసారే అది సాధ్యపడకపోవచ్చు. మీకు సౌకర్యంగా అనిపించినంత వేగంగా నడిస్తే సరి. అసలంటూ మొదలుపెడితే... కొన్నాళ్లకు స్పీడు పెరుగుతుంది. సాధారణంగా చదునుగా ఉండే మార్గం కంటే కాస్త ఎత్తుగా ఉండే ప్రాంతాల్లో (కొండలు, గుట్టలు లాంటి ప్రదేశాల్లో) నడవడం వల్ల ఎక్కువ కెలొరీలు ఖర్చవుతాయి. దీనివల్ల మీ శ్వాస రేటు పెరుగుతుంది. ఫలితంగా ఆక్సిజన్‌ సరఫరా ఎక్కువవుతుంది.
* నడవడం వల్ల బరువు తగ్గడమే కాక కాళ్లు, చేతులు, కీళ్ల కండరాలు బలంగా మారతాయి. ఎముకలు గట్టిపడతాయి. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం బయట వాకింగ్‌ ట్రాక్‌ల మీద, రోడ్లమీద నడిచే పరిస్థితులు లేవు కాబట్టి ఉన్నచోటే నిలబడి నడవండి. ఇది కూడా ఇప్పుడు ట్రెండే.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి