పొట్ట తగ్గాలా...
close
Published : 25/05/2021 00:58 IST

పొట్ట తగ్గాలా...

పెరిగిన పొట్ట వల్ల దుస్తులు బిగుతుగా మారడమే కాదు..రకరకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. నలుగురిలోకీ వెళ్లాంటే నామోషీగా ఫీలవుతారు. ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ పొట్టను  సరైన వ్యాయామాలు చేస్తూ, ఆహారంలో కొన్ని మార్పుల ద్వారానూ తగ్గించుకోవచ్చు. ఎలా అంటే...
వీటికి దూరంగా!
వేపుళ్లు... వీటిలో కెలొరీలు ఎక్కువ. ఈ వంటకాల్లోని నూనె పొట్టలోకి వెళ్లి కొవ్వుగా మారుతుంది. ఇది కరిగిపోవడం చాలా కష్టమైన ప్రక్రియ. దాంతో ఊబకాయం, మధుమేహం, మరికొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వేపుళ్లకు దూరంగా ఉండాలి.
చక్కెర ద్రవాలకూ... మనం తాగే సోడా, శీతల పానీయాలు, మార్కెట్లో దొరికే పండ్లరసాల్లో పెద్ద మొత్తంలో చక్కెర ఉంటుంది. అలాగే బిస్కట్లు, బేకరీ ఉత్పత్తులు, చాక్లెట్లలో కూడా. వీటి నుంచి తక్కువ కెలొరీలు లభిస్తాయి. అయితే చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తం, హర్మోన్లపై ప్రభావాన్ని చూపుతుంది.  ఇది పొట్టకే కాదు కాలేయంలోనూ కొవ్వులు జమ కావడానికి కారణమవుతుంది. ఇది అనారోగ్యానికి సంకేతం. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.


ఉప్పు... పొట్ట పెరగడానికి ఉప్పు ఎక్కువగా తినడం కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగాలనిపిస్తుంది. అలా అని అవసరానికంటే ఎక్కువ నీళ్లు తాగితే అది సమస్యే కదా. ఇది మీ బరువులో మార్పు తెస్తుంది.


మరి ఏం చేయాలంటే... వేపుళ్లకు బదులుగా కూరగాయలను ఉడికించి తీసుకోవాలి. లేదా అవెన్‌లో ఉడికించాలి. స్వీట్‌ తినాలనిపించినప్పుడు బెర్రీ, మామిడి లాంటి పండ్లను తినాలి. టీ కాఫీలకు బదులుగా కూరగాయలు, పండ్ల రసాలను తాగాలి. చిప్స్‌, వడియాలు, అప్పడాలు కాకుండా ఎండుఫలాలు, గింజలు, ప్రూట్‌ క్యాండీలను తింటే సరి.


ఇవి తినండి!

యాపిల్‌... రోజూ ఓ యాపిల్‌ తింటే మీ పొట్ట తగ్గుతుంది తెలుసా... ఈ పండులో ఆరోగ్యకరమైన పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని అధిక కొవ్వులను కరిగిస్తుంది.  


పెరుగు... ప్రొటీన్‌భరిత పెరుగు పొట్టలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. దీంట్లోని అధిక ప్రొటీన్‌ జీవక్రియలను మెరుగు పరుస్తుంది. ఇవి అధిక కెలొరీలను కరిగించడంతో పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.
చిరుధాన్యాలు... పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించడంలో చిరుధాన్యాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ముతకబియ్యం, గోధుమలు, ఓట్స్‌, క్వినోవా, రాగులు, సామలు, జొన్నలు... వీటన్నింటినీ ఆహారంలో చేర్చుకోండి మరి.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి