మార్గదర్శిలా మారండి!
close
Updated : 25/05/2021 06:19 IST

మార్గదర్శిలా మారండి!

పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లను నేర్పితే భవిష్యత్తులో ఓ క్రమశిక్షణ అలవడుతుంది. అది వారు ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేస్తుంది.
పళ్లు తోముకోవడం నుంచి అన్నం తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం వరకు అన్నీ చిన్నప్పటి నుంచే నేర్పాలి. పోషక విలువలున్న ఆహారం తీసుకునేలా చూడాలి.
* పొరపాటు/ తప్పు జరిగినప్పుడు క్షమాపణలు అడగడం, ఏదైనా తీసుకున్నప్పుడు, ఎదుటి వారి సేవలు పొందినప్పుడు కృతజ్ఞతలు చెప్పడం నేర్పాలి.
మీరే మార్గదర్శి...
పిల్లలు అమ్మానాన్నలను చూస్తూ పెరుగుతారు. కాబట్టి వారికి నేర్పించే ముందు కన్నవారు కచ్చితంగా పాటించాలి. అప్పుడే చిన్నారులు వాటిని అనుసరిస్తారు.
సానుకూలంగా...
మీ ప్రవర్తన, ఇంట్లో వాతావరణం... ఇలా అన్నీ చిన్నారికి సానుకూలంగా ఉండేలా చూడాలి. తెలియక పొరపాటు జరిగితే తిట్టడం, కొట్టడం లాంటివి కాకుండా అందుకు కారణమేంటో తెలుసుకోవాలి. ప్రశాంత వాతావరణంలో వారిని పెంచాలి. ఇతరులతో పోల్చనూ వద్దు.
చిన్నారి సామర్థ్యాన్ని నమ్మండి...
చాలామంది పిల్లలపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. ముందుగా చిన్నారి శక్తిసామర్థ్యాలేంటో గ్రహించాలి. తను అందరిలాగే సాధారణ పిల్లాడనే విషయం మరవొద్దు. మీ అంచనాలను అందుకోవాలంటూ వారి మీద ఒత్తిడి పెంచొద్దు.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి