రంగు ఏం చెబుతోంది?
close
Published : 28/05/2021 01:22 IST

రంగు ఏం చెబుతోంది?

చాలామంది మూత్రం రంగు కాస్త మారితే నీళ్లు తక్కువ తాగాను అందుకే అలా జరిగింది అని సరిపెట్టుకుంటారు. అలాగని పారదర్శకంగా ఉంటే ఏ ఇబ్బందీ లేనట్టేనా?
నిజానికి మూత్రం రంగు పూర్తిగా పారదర్శకంగా ఉంటే దానర్థం అతిగా నీళ్లు తాగుతున్నారని. అవసరం అయిన దానికన్నా ఎక్కువగా తాగితే ఇలా తెల్లగా కనిపిస్తుంది.
లేత పసుపురంగులో ఉండటం ఆరోగ్య సూచిక. తగినన్ని నీళ్లు తాగుతూ ఆరోగ్యంగా ఉండే వారిలో మూత్రం ఇలా ఉంటుంది. అదే కాస్త ముదురు పసుపురంగులో ఉంటే... మరి కొన్ని నీళ్లు తాగాల్సిన అవసరం ఉందని.
ముదురు గోధుమరంగులో ఉంటే... శరీరం డీహైడ్రేషన్‌తో బాధపడటం లేదా కాలేయ సమస్యన్నాయని అర్థం. ఎరుపు ఛాయలు కనిపిస్తే కిడ్నీ.. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు ఉన్నాయని. దీనికి మబ్బులాంటి ఒక తెల్లని చిక్కదనం కూడా తోడైతే... కిడ్నీ సంబంధిత సమస్యలున్నాయేమో గమనించుకోవాలి.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి