బంధం బలపడాలంటే...
close
Published : 30/05/2021 00:18 IST

బంధం బలపడాలంటే...

భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలతో దూరమవుతున్నారు. విడిపోయేటంత గొడవలు లేకపోయినా.. దూరంగా ఉండటం వల్ల అది విడాకులకు దారితీస్తుంది. అయితే కొన్ని సూత్రాలు పాటిస్తే బంధం బలంగా మారుతుంది.

చాలా మంది చిన్న గొడవ జరిగితే చాలు.. మాట్లాడటం మానేస్తుంటారు. అలా చేస్తే సమస్య పరిష్కారం కాకపోగా దూరం పెరుగుతుంది. కాబట్టి ఎన్ని తిట్టుకున్నా.. ఎంత గొడవ పడినా.. ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్‌ ఉండాలి. లేకపోతే ఆ బంధం శాశ్వతంగా తెగిపోయే ప్రమాదముంది. అందువల్ల ఇగోలను పక్కన పెట్టి మాట్లాడుకోవాలి. ఇద్దరూ కలిసి సమస్యను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలి.

కొత్తదనాన్ని ఆస్వాదించాలి..
బంధం బోర్‌ కొట్టకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండాలి. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు ఔటింగ్‌కు వెళ్లాలి. కొత్త ప్రదేశాలను చూసి, సరదాగా గడుపుతూ ఉండాలి. ఎంత తీరిక లేకున్నా మీ ఇద్దరి కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.

మెచ్చుకుంటూ ఉండాలి..
వేరు వేరు వృత్తుల్లో ఉన్నప్పుడు ఒకరు చేస్తున్న పనిని మరొకరు గౌరవించుకోవాలి. ఏదైనా సందర్భంలో తన జాబ్‌ గురించి మెచ్చుకుంటూ ఉండాలి. ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు సాగాలి. అప్పుడే సంసారం సాఫీగా సాగుతుంది.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి