వంటింటి భారం తగ్గిస్తోంది!
close
Published : 30/05/2021 00:27 IST

వంటింటి భారం తగ్గిస్తోంది!

‘మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఫలానా ఉచితం’... ఇలాంటి హామీల్ని  ఎన్నికల ముందు వింటూ ఉంటాం కదా! కేరళలో ఎల్‌డీఎఫ్‌ పార్టీ కూడా అలాంటి ఒక హామీనే ఇచ్చింది అక్కడి మహిళలకు. అదేంటో తెలుసా?... మా పార్టీని గెలిపిస్తే వంటింట్లో మీ పని భారం తగ్గిస్తామని. గెలవడంతో ఇచ్చిన మాటని నిలబెట్టుకునేందుకు ఎల్‌డీఎఫ్‌ పార్టీ నేతృత్వంలోని పినరయి విజయన్‌ ప్రభుత్వం స్మార్ట్‌ కిచెన్‌ స్కీమ్‌ని తీసుకురానుంది. ఇంతకీ ఈ స్కీమేంటంటే... వంటింటిని స్మార్ట్‌గా మార్చుకునేందుకు అవసరమైన గ్రైండర్లు, మిక్సీలు, ఫ్రిజ్‌లు, అవెన్‌లు, డిష్‌వాషర్లు వంటి వాటిని సబ్సిడీ ధరలకే అందిస్తోంది. లబ్ధిదారులు వస్తువు ధరలో మూడోవంతు కడితే చాలు. తక్కిన మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. మగవాళ్లతో సమానంగా స్త్రీలు కూడా ఉత్పాదక రంగంలోకి వచ్చినప్పుడే సంపదని సృష్టించగలుగుతాం. కానీ సగం కంటే ఎక్కువ మంది స్త్రీలు రోజంతా వంటింట్లోనే గడిపేస్తుంటే ఆర్థికంగా స్త్రీలు వెనుకబడతారనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి