Diabetes: కరోనా వచ్చినా షుగర్‌ అదుపులో ఉండాలంటే!
close
Updated : 04/06/2021 09:40 IST

Diabetes: కరోనా వచ్చినా షుగర్‌ అదుపులో ఉండాలంటే!

మా అత్తయ్యకు 55 ఏళ్లు. తనకు షుగరుంది. ఇంట్లోనే ఉంటూ మాత్రలు వాడుకునే ఆమె లాంటి మధ్యవయస్కుల్లో కరోనా వచ్చినా ఆహారం ద్వారా బ్లడ్‌షుగర్స్‌ను ఎలా నియంత్రించుకోవచ్చు?

- ఓ సోదరి

ధుమేహం ఉన్నా... రక్తంలో చక్కెరస్థాయులు నియంత్రణలో ఉంచుకుంటూ, మంచి ఆహార అలవాట్లు పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా అన్ని పాటిస్తూ ఉంటే కొవిడ్‌ వచ్చినా వారి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండకపోవచ్చు. కొవిడ్‌ వచ్చిన కొందరిలో ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు) వల్ల సహజసిద్ధంగానే చక్కర స్థాయులు పెరగొచ్చు. కాబట్టి కొవిడ్‌ వచ్చిన తర్వాత వాడుతున్న మందులు, గ్లూకోమీటరుతో చక్కెర స్థాయులను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ షుగర్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవాలి. 

ఆహారంలో మార్పులు!
కొవిడ్‌ వచ్చినా మధుమేహులు అప్పటిదాకా పాటించిన ఆహార నియమాలనే అనుసరించాలి. ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెరస్థాయులు పెరగొచ్చు. కాబట్టి ఒక్కసారిగా అలవాట్లలో మార్పులు చేసుకోవద్దు. అలాగే మోతాదూ పెంచొద్దు. మాంసకృత్తులు, పీచు, ప్రొబయోటిక్‌ పదార్థాలు, ఒమేగా-3 కొవ్వులను మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. కీలక పోషకాలను కొద్ది మొత్తంలో తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. వీలైనంత మటుకు వ్యాయామం చేయాలి.


ప్రొటీన్స్‌: ఉడికించిన గుడ్డు, పప్పుదినుసులు: సోయా నగ్గెట్స్‌.
పీచు:  పొట్టు తీయని ధాన్యాలు. ఇడ్లీ రవ్వ బదులు జొన్నరవ్వ, మధ్యాహ్నం అన్నానికి బదులుగా ముడి బియ్యం, గోధుమ రవ్వ కూడా ఎంచుకోవచ్చు. ఓట్స్‌ జావ, రాత్రిపూట ఓట్స్‌ రాగి ముద్ద, కొర్రల కిచిడి తీసుకోవచ్చు. వీటితో పాటు రోజూ కనీసం 100 గ్రా. ఆకు కూరలు, 200 గ్రా., కూరగాయలు, 100 గ్రా. కీర, క్యారెట్‌ లాంటి వాటిని సలాడ్లుగా తినాలి.

ప్రీ, ప్రొ బయోటిక్‌ పదార్థాలు:  శరీరానికి మేలు చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు ఇవి దోహదపడతాయి.  కాబట్టి ఆహారంలో తక్కువ వెన్నశాతం పాలు, పెరుగు, పుల్ల మజ్జిగ వాడుకోవాలి. ఉల్లిపాయలు, అరటికాయ, ఓట్స్‌ను తీసుకోవాలి.
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు: వాపులు తగ్గించడానికి ఇవి అవసరం. పొట్టుతో ఉన్న ధాన్యాలు, పప్పులు, అవిసె, చియా గింజలు, ఆకుకూరలు, చేపలు, గుడ్లు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి