పాప ఫ్రెండ్స్‌కి వీడియోకాల్‌ చేయండి!
close
Updated : 06/06/2021 00:24 IST

పాప ఫ్రెండ్స్‌కి వీడియోకాల్‌ చేయండి!

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన చిన్నారులు స్నేహితులకు దూరమయ్యారు. ఆటలు ఆగిపోయాయి. ఫలితంగా ఊబకాయం బారిన పడటమే కాదు... ఒత్తిడికీ గురవుతున్నారు. చిరాకుతో పెద్దలతో పేచీలు పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే...
ఇంట్లోనే ఉంటున్నారు కదా. నచ్చినప్పుడు తినొచ్చు. ఆలస్యంగా పడుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ ఇది పిల్లల మెటబాలిజంలో మార్పుని తెస్తుంది. అనారోగ్యాలకు దారితీస్తుంది. మీ చిన్నారుల జీవనశైలిని గమనించండి. గత అలవాట్లలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయండి. ఉదాహరణకు ఒకప్పుడు ఉదయం ఆరుకే లేచి ఉండొచ్చు. ఇప్పుడు కనీసం ఏడుకైనా లేవాలి. ఉదయం ఓ గంట వార్తాపత్రికలు చదివించండి. కాసేపు పూజ, ధ్యానం చేసుకునేలా అలవాటు చేయండి. ఇవన్నీ వారిని క్రమబద్ధీకరిస్తాయి.
* పిల్లలకు శారీరక శ్రమ తగ్గిపోయింది. దాంతో నాలుగడుగులు వేస్తే అలసిపోతున్నారు. ఎండ తగలక.... ఎప్పుడైనా బయటకు వెళ్తే త్వరగా డస్సిపోతుంటారు. అందువల్ల ఉదయం ఆరు బయటకు వెళ్లి ఆడుకో లేక పోయినా, ఇంటి మిద్దెపైన కాసేపు పరుగెత్తమనండి. ఉన్నచోటే నిలబడి నడవమనండి. అలాంటి అవకాశం లేదనుకుంటే... గదిలోనే కాస్త ఖాళీగా ఉన్నచోట తాడాట ఆడమనండి. పాకడం, ఎగరడం, దుమకడం వంటివి సరదాగా చేయించండి. ఇవన్నీ వారికి మంచి వ్యాయామాలు.
* కరోనా కాలంలో చిన్నారులకు స్నేహాలూ తగ్గాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వాటిని పునరుద్ధరించండి. పాప స్నేహితులందరినీ వీడియోకాల్‌లోకి తీసుకుని చిన్న చిన్న టాస్క్‌లు ఇవ్వండి. గేమ్స్‌ ఆడించండి. గెలిచినవారికి చిన్నచిన్న కానుకలు ఇవ్వండి. ఇవన్నీ పిల్లలకు ఉత్సాహాన్నిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి