ఆటోడ్రైవరు కూతురు.. ఆక్సిజన్‌ అందిస్తోంది
close
Updated : 06/06/2021 00:24 IST

ఆటోడ్రైవరు కూతురు.. ఆక్సిజన్‌ అందిస్తోంది

ఆమెది సాధారణ కుటుంబం. తండ్రి ఆటోడ్రైవర్‌. ఈ కొవిడ్‌ సమయంలో తనూ సాయం చేయాలనుకుంది. ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్న వారికి సిలిండర్లు సరఫరా చేస్తోంది. ఆమే.. హబీ బున్నిసా.
బెంగళూరులోని సీజీ ఆసుపత్రిలో ఓ కొవిడ్‌ బాధితుడు ఆక్సిజన్‌ స్థాయి పడిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిసిన వారిని ఆరా తీయగా, దేవన్‌గిరికి చెందిన కాలేజీ విద్యార్థిని హబీబున్నిసా గురించి చెప్పారు. విషయం తెలిసి హబీ హుటాహుటిన ఆక్సిజన్‌ సిలిండర్‌ను తెచ్చి అందించింది. ఆ రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇలా ఎంతో మందికి సాయమందిస్తోందీమె. హబీ వాళ్ల నాన్న మహమ్మద్‌ జబీర్‌ ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తాడు. తల్లి గృహిణి. తమకున్న దాంట్లోనే ఇతరులకు సాయపడాలనే గుణాన్ని హబీ తండ్రి నుంచి నేర్చుకుంది. మిల్లట్‌ కాలేజీలో ఐటీఐ ఎలక్ట్రికల్‌ రెండో ఏడాది చదువుతో పాటు దేవన్‌గిరి యూనిట్‌కు యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలిగానూ వ్యవహరిస్తోంది. నిరుపేద పిల్లలకు చదువు చెబుతోంది, ఆసక్తి ఉన్న వారిని క్రీడల్లో ప్రవేశించేలా కృషి చేస్తోంది. తను వాలీబాల్‌ క్రీడాకారిణి కూడా. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలనూ అందుకుంది.

గతేడాది కరోనా ప్రభావం హబీ కుటుంబంపైనా పడింది. ఆటో ద్వారా ఆదాయం లేకపోవడంతో ఆర్థికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంది. అయినా చుట్టుపక్కల వారి ఇబ్బందులను గుర్తించి తాము దాచుకున్న నగదుతో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, మాస్క్‌లు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఆక్సిజన్‌ అందక ఎందరో చనిపోతున్నారని తెలుసుకున్న హబీ దాతల సాయంతో ఆక్సిజన్‌ సిలిండర్లను పంపిణీ చేస్తోంది.

‘సిలిండర్‌ అవసరమైన వాళ్లు సంప్రదించమని సోషల్‌ మీడియాలో, యూత్‌ కాంగ్రెస్‌ యూనిట్‌ ద్వారా అందరికీ సమాచారాన్ని పంపాను. దీంతో అత్యవసరమైన వాళ్లు ఫోన్‌ చేస్తున్నారు. మా అన్నయ్య ద్విచక్ర వాహనం మీద వెళ్లి వారికి అందిస్తున్నా. వాళ్లు కోలుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంతేకాదు అమ్మ రోజూ రోటీలు చేసి ఇస్తే, వాటిని పేదలకు పంపిణీ చేస్తున్నా. మనం బాగుంటే చాలదు, చుట్టుపక్కల వాళ్లూ బాగుండాలి అని చెప్పే అమ్మా నాన్నలే నాకు ఈ సేవాభావాన్ని అలవరిచారు. రోజుకి  నాలుగైదు ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేయగలుగుతున్నా’ అని చెబుతోంది హబీ.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి