Corona: కొండంత భారం మోపిన కొవిడ్‌!
close
Updated : 06/06/2021 07:18 IST

Corona: కొండంత భారం మోపిన కొవిడ్‌!

కొవిడ్‌ వల్ల కార్యాలయాల్లో, ఇంట్లో మహిళలపై విపరీతమైన భారం పెరిగిందని ఇది వారిపై తీవ్ర ప్రభావం చూపుతోందని డెలాయిట్‌ సంస్థ అధ్యయనంలో తెలుస్తోంది.
కొవిడ్‌ సమయంలో మహిళల ఉద్యోగ సంతృప్తి, మానసిక ఆరోగ్యం విపరీతంగా దెబ్బతిన్నాయన్నది డెలాయిట్‌ నివేదిక సారాంశం. గత నవంబర్‌, ఈ ఏడాది మార్చిల్లో ఈ సర్వేను నిర్వహించారు.

ప్రతి 10 మందిలో ఏడుగురు (69 శాతం) భారతీయ మహిళలు కొవిడ్‌కు ముందు తమ ఉద్యోగం చాలా బాగుందని లేదా బాగుందని చెప్పారు. కానీ ప్రస్తుతం 28 మాత్రమే ఈ సమాధానాన్ని మళ్లీ ఇవ్వగలిగారు. కొవిడ్‌ ముందుకీ, ఇప్పటికీ ఎంత భారీ మార్పో దీన్ని చూస్తే అర్థమవుతుంది. దాదాపు 10లో ఆరుగురు (57 శాతం) మహిళలు తమ కెరీర్‌లో ఆశించినంత వేగంగా వృద్ధి లేదని చెప్పారు. ఇది ప్రపంచ సగటు (42 శాతం) కంటే ఎక్కువ. ఎంచుకున్న ఉద్యోగాల పట్లా మునుపటి కంటే తక్కువ ఆశాజనకంగా ఉన్నారు. ఇది గ్లోబల్‌ శాంపిల్లో 51 శాతంతో సమానం.

26 శాతానికిపైగా భారతీయ మహిళలు ఉద్యోగాన్ని వదిలేయాలని ఆలోచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది 23 శాతముంది. పనిభారం, ఇంటి బాధ్యతల్లో పెరుగుదలే ఇందుకు కారణంగా చెబుతున్నారు. కొద్ది శాతం సంస్థలు మాత్రమే తమ ఉద్యోగినులకు అవసరమైన వనరులను కల్పిస్తున్నాయి. ఎక్కువ జీతంతో కూడిన ప్రసూతి సెలవులను ఇస్తున్నాయి. అధికారిక మెంటర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లు మహిళలకు అందిస్తున్నది చాలా తక్కువ (దేశీయంగా 17%, ప్రపంచవ్యాప్తంగా 22). అభివృద్ధి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా 22% ఉంటే మన మహిళలకు 16 శాతమే. పదోన్నతుల విషయంలో లింగ వివక్ష మన దగ్గర 15%, ప్రపంచవ్యాప్తంగా అది 19%. 38 శాతం మందికి మాత్రమే వివక్ష, వేధింపులపై ఎలా ఫిర్యాదు చేయాలన్న స్పష్టత ఉంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి