పిల్లల ముందు అలా చేయొద్దు!
close
Updated : 08/06/2021 04:14 IST

పిల్లల ముందు అలా చేయొద్దు!

భార్యాభర్తలన్నాక భేదాభిప్రాయాలు, రుసరుసలు, వాదనలు ఉండనే ఉంటాయి. కానీ వీటిని పిల్లల ముందు ప్రదర్శించడం మంచిది కాదు. అలా చేస్తే వారు కుంగుబాటుకి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అలా కాకూడదంటే...!

భాగస్వామిపై కోపం వచ్చినప్పుడు వెంటనే నిలదీయాలనుకోవద్దు. ముఖ్యంగా పిల్లల ముందు మనసుని, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే చిన్నారుల్ని మానసికంగా ఆందోళనకు గురిచేసే విషయాల్లో.. తల్లిదండ్రులు విడిపోతారనే భయం కూడా ఒకటని చెబుతున్నాయి పలు పరిశోధనలు. విడిపోవడం దాకే అక్కర్లేదు.. అమ్మానాన్నలిద్దరూ ఎడమొహం పెడమొహం అన్నట్టున్నా చదువుల్లో ఏకాగ్రత కోల్పోతారు. కాబట్టి మీ కోపాన్ని వ్యక్తం చేయడానికి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించండి.
* భార్యాభర్తలుగా మీ మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా... మీరే చక్కదిద్దుకోవాలి. అలాకాకుండా ఎదుటివారిపై మీ ద్వేషాన్ని, అభిప్రాయాల్ని పిల్లలపై రుద్దే ప్రయత్నం చేయొద్దు. ‘నాన్న ఎప్పుడూ ఇలానే చేస్తాడు తన మాట వినకు’, ‘మీ అమ్మ ఎప్పటికీ ఇంతే మారదు...’ వంటి మాటలు చిన్నారులను నొప్పిస్తాయి.  అప్పుడు మీ వ్యాఖ్యల్ని వ్యతిరేకించలేక, అవతలి వారితో ప్రేమను వ్యక్తపరచలేక దిగులు చెందుతుంటారు. మీ భాగస్వామిపై  కోపాన్నీ, వారి ప్రవర్తన వల్ల ఏర్పడ్డ బాధని నోటితో వ్యక్తపరిచే బదులు... ఓ కాగితంపై రాయండి. వాటిని పంచుకునేందుకు ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల క్రమంగా మీ సమస్యల తాలూకు తీవ్రత తగ్గి సర్దుబాటుకి వస్తారు.
* మీ మధ్య ఉన్న అసంతృప్తి ఏదైనా సరే... పిల్లల మధ్యకి రాకముందే వాటి గురించి మాట్లాడుకోండి. సమస్య ఒక్కసారిగా పరిష్కారం కాకున్నా.. కోప్పడే ఆస్కారం తగ్గుతుంది. వీలైనంతవరకూ వారి ముందు సాధారణంగా ఉండటానికి ప్రయత్నించండి. అలానే మీ ఉద్వేగాలను చిన్నారులపై ప్రదర్శించడం అంత మంచిది కాదు. ఇలా చేస్తుంటే... వారు మిమ్మల్ని చూసి భయపడే పరిస్థితి ఎదురవుతుంది. మీ ఇద్దరికీ దూరంగా ఉండాలనే భావనకు వస్తారు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి