దొంగ జేబుల ఫ్యాషన్‌!
close
Updated : 09/06/2021 04:20 IST

దొంగ జేబుల ఫ్యాషన్‌!

వింటర్‌వేర్‌ తెలుసు. సమ్మర్‌వేర్‌ గురించీ తెలుసు. మరి తెఫ్ట్‌ప్రూఫ్‌ వేర్, పిక్‌పాకెట్‌ వేర్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఫోను, డబ్బులు, నగలు వంటి విలువైన వస్తువులు దొంగల పాలవ్వకుండా రక్షణ కల్పించడమే ఈ హిడెన్‌ పాకెట్‌ వేర్‌ ప్రత్యేకత. అమ్మాయిల స్కార్ఫ్‌లు, టాప్‌లు, స్కర్టులు, బెల్టుల్లో... విలువైన వస్తువులని దాచుకునేందుకు వీలుగా పాకెట్లని అమర్చి ప్రత్యేకంగా ఈ రకం దుస్తుల్ని రూపొందిస్తున్నాయి సంస్థలు. ట్రావెల్‌ స్కార్ఫ్, హిడెన్‌పాకెట్‌ టాప్స్, సెక్యూరిటీ బ్రాపాకెట్స్‌ వంటివి భలేగా ఉపకరిస్తాయి.  

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి