ఆన్‌లైన్‌ శిక్షణలో ఆమె ముద్ర
close
Published : 13/06/2021 02:06 IST

ఆన్‌లైన్‌ శిక్షణలో ఆమె ముద్ర

కొవిడ్‌ పరిణామం చిన్న తరగతుల పిల్లలకీ ఆన్‌లైన్‌ బోధనను పరిచయం చేసింది. రోజు మొత్తంలో తాపీగా నేర్చుకునేవి గంట, రెండు గంటల్లో నేర్చేసుకోవాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు అర్థం చేసుకోలేక పిల్లలు, ఏం చేయాలో తెలియక అమ్మానాన్నలు సతమతమవుతుంటారు. ఇదే పరిస్థితి ఆన్‌ ఆండ్రూస్‌కీ ఎదురైంది. దానికి కనుక్కున్న పరిష్కారం ఆమెను ఏకంగా వ్యాపారవేత్తని చేసింది.
ఆన్‌ ఆండ్రూస్‌కి టెస్సా అనే తొమ్మిదేళ్ల కూతురుంది. గత ఏడాది లాక్‌డౌన్‌తో చదువంతా ఆన్‌లైన్‌ మయమైంది. లెక్కల్లో ఆమె చాలా వెనుకబడింది. ఉన్న కొద్ది సమయంలో మళ్లీ అడిగే, సందేహాలు తీర్చుకునే వీలు లేకపోవడంతో ఆ అమ్మాయి డీలాపడింది. వీళ్ల కుటుంబం యూఎస్‌లో స్థిరపడింది. ట్యూటర్‌ ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న పని. తనకూ ఆఫీసు, ఇంటిపనితో చెప్పడం కుదిరేది కాదు. పరిష్కారం గురించి మదన పడుతున్న ఆన్‌కి ఒక ఆలోచన వచ్చింది. అదే తను చదివిన కళాశాల విద్యార్థులను సంప్రదించడం.
ఆన్‌ది కేరళలోని తిరువనంతపురం. అక్కడే కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చదివింది. అక్కడి మూడో ఏడాది విద్యార్థులను సంప్రదించింది. మొదట కొంత కష్టమైనా చివరికి ఒకరు ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌కు ఒప్పుకున్నారు. తన కూతురి చదువులో కొంత మార్పు వచ్చినా.. ఆ అమ్మాయి అంతగా ఆసక్తి చూపకపోవడం ఆన్‌ గమనించింది. దీంతో తన స్నేహితులనూ జోడించింది. ఈసారి ఆ అమ్మాయి ఉత్సాహంగా హాజరవడంతోపాటు మార్కులూ మెరుగుపడ్డాయి. దీన్నే వ్యాపారంగా మలిస్తే బాగుంటుందనుకుని ‘టెక్‌ఫ్యూనిక్‌’ను ఏర్పాటు చేసింది.
ఇదో ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌ వెబ్‌సైట్‌. దీన్ని 8-15 ఏళ్ల పిల్లలను ఉద్దేశించి రూపొందించారు. విద్యార్థి అవసరాలకు అనుగుణంగా బోధన ఉంటుంది. మేథమేటిక్స్‌, టెక్నాలజీ, కోడింగ్‌లను బోధిస్తారు. ఆన్‌ న్యూయార్క్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులో టెక్నాలజీ ప్రోగ్రామ్‌ మేనేజర్‌. తన స్టార్టప్‌ గురించి తెలిసి సహోద్యోగులు, ఇతర భారతీయులు పిల్లలను చేర్చడానికి ముందుకొచ్చారు. కొందరు మాతృభాషనూ నేర్పితే బాగుంటుందన్న సూచన చేశారు. వారికోసం ‘భాషాఫ్యూనిక్‌’ రూపొందించింది. దీనిలో పిల్లలను చిన్న చిన్న గ్రూపులుగా చేసి బోధిస్తారు. ట్యూటర్‌లను ఆన్‌ స్వయంగా ఎంపిక చేస్తుంది. వివిధ అంశాల్లో పరీక్షిస్తుంది. ముందు సీనియర్లతో కలిసి బోధించేలా చూసి, వాళ్లు చెప్పగలరని నమ్మకం వచ్చాకే పూర్తిస్థాయిలో తరగతిని అప్పగిస్తుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 147 కళాశాలల విద్యార్థులు దీనిలో పనిచేస్తున్నారు. ఎక్కువగా అమ్మాయిలు, ఆర్థికంగా వెనుకబడినవారికి అవకాశం ఇస్తోంది. ప్రస్తుతం దీనిలో పనిచేస్తున్నవారిలో 75%పైగా అమ్మాయిలే. ఇది వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందంటుంది ఆన్‌. ప్రతి విద్యార్థి నుంచీ కొంత ఫీజు తీసుకుంటుంది. దాంతో ట్యూటర్లకు జీతాలతోపాటు విద్యార్థులకు అవసరమైన పరికరాలనూ అందజేస్తోంది. ‘మన దగ్గర కలిసి చదువుకోవడం చాలా మామూలు విషయం. కానీ లోతుగా పరిశీలిస్తే ఇది పిల్లల్లో ఆరోగ్యకరమైన పోటీతోపాటు నేర్చుకోవాలనే కోరికను కలిగిస్తుందన్న విషయం అర్థమవుతుంది. దాన్నే నేను మా అమ్మాయి విషయంలో ఉపయోగించాను. ఆమె పరంగా, వ్యాపారపరంగా రెండు విధాలుగా విజయం సాధించాను’ అని ఆనందంగా చెబుతోంది ఆన్‌ ఆండ్రూస్‌.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి