ఫ్రెషరా.. తెలుసుకోండివి
close
Published : 13/06/2021 02:06 IST

ఫ్రెషరా.. తెలుసుకోండివి

మొదటి ఉద్యోగం అనగానే కాస్త బెరుకు, కంగారు సాధారణమే. ఇంటర్వ్యూ నుంచి అపాయింట్‌మెంట్‌ వరకు ఆన్‌లైన్‌లో సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి ఇంకాస్త ఎక్కువుండే అవకాశముంది. పైగా పెరుగుతున్న సామాజిక దూరం. ఈ సమయంలో అందరి మనసూ గెలవాలంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే!
కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నారంటే.. ఏ కొద్దిపాటి అనుభవం ఉన్నవారైనా మీ కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నట్టే. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్కూలు, కళాశాల స్థాయిలో ఎంత మంచి ర్యాంకులు, మార్కులు సాధించినా.. పని విషయంలో కొత్తగా నేర్చుకునేవే ఎక్కువ. కాబట్టి, గత విజయాలను పక్కనపెట్టేయాలి.
* అందరూ కొత్త అమ్మాయి కదా అని ఆప్యాయంగా ఉంటారని ఆశించొద్దు. వాళ్లే వచ్చి పలకరిస్తారనీ అనుకోవద్దు. అసలే ఇప్పుడు దాదాపుగా సంస్థల కార్యకలాపాలన్నీ ఇంటి దగ్గర్నుంచే. కాబట్టి, అవసరమైతే తప్ప వాళ్లు మాట్లాడే అవకాశం తక్కువ. మీరే చొరవ తీసుకుని టీమ్‌ మొత్తాన్నీ పరిచయం చేసుకోవాలి. మార్గనిర్దేశం చేయమని అడగొచ్చు.
* కొందరు వాళ్లంతట వాళ్లే వచ్చి సాయమంది స్తారు. ఒక్కోసారి వాళ్లే మీ పనిని పూర్తిచేస్తుంటారు. దాన్ని ఆసరాగా తీసుకుని ఏమీ చేయకుండా ఉండొద్దు. మీరు చేస్తుంటే గైడ్‌ చేయ మని వాళ్లని కోరొచ్చు. నేర్చుకోవడంతోపాటు పనిమీద మీ ఆసక్తిని ఎదుటివారికి తెలియజేసినట్లవుతుంది.
* కొన్నిసార్లు సాయం చేయాలని ఉన్నా పని కారణంగా కుదరకపోవచ్చు. అలాంటప్పుడు మీరు చేయాల్సిన విధులేంటో తెలుసుకుని, వాటిని సరిగా పూర్తిచేసేలా చూసుకోవాలి. ఇదీ నేర్చుకోవడంలో భాగమే. కొత్తలో తెలిసీ తెలియక తప్పులు చేయడం మామూలే. కానీ సంస్థకంటూ కొన్ని నిబంధన లుంటాయి. వాటిని ముందుగానే తెలుసుకుంటే చాలావరకూ తప్పు జరగకుండా చూసుకోవచ్చు.
* సమయపాలన తప్పక పాటించాలి. కొత్త కాబట్టి, చేసే ప్రతిచర్యనూ గమనిస్తుంటారు. మాట్లాడే మాట, చేసే పని పట్ల జాగ్రత్త వహించాలి. సినిమాల చర్చలు, కబుర్లకు తావివ్వొద్దు. చొరవ తీసుకోవడం, పని పట్ల శ్రద్ధ, బాధ్యతతో ఉండటం వంటి లక్షణాలు మీలో ఉన్నాయని చూపించుకోవాలి. సంస్థలు తమ ఉద్యోగుల నుంచి ఆశించేవీ ఈ లక్షణాలే.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి