బ్రాస్‌లెట్‌ స్టైల్‌ మారింది...
close
Published : 16/06/2021 00:38 IST

బ్రాస్‌లెట్‌ స్టైల్‌ మారింది...

దుస్తులకు తగ్గట్లుగా ఇప్పుడు బ్రాస్‌లెట్‌ నూతన ఫ్యాషన్‌ను సంతరించుకుంది. నాలుగైదు వరసల్లో చేతికి నిండుదనాన్ని అందిస్తూ కొత్త అందాన్ని తెచ్చిపెడుతోంది. దారాల అల్లికల మధ్య వర్ణభరితమైన రాళ్లు, ముత్యాలు, అలనాటి నాణేలు ఒదిగిపోయి మెరిసిపోతున్నాయి. డ్రస్‌ రంగు, స్టైల్‌బట్టి తయారుచేస్తున్న ఈ బ్రాస్‌లెట్స్‌ ఇప్పుడు అమ్మాయిల మనసును దోచుకుంటున్నాయి. సంప్రదాయ దుస్తుల నుంచి ఆధునిక ఫ్యాషన్‌కు తగ్గట్లుగా చివర్లో గవ్వలు, ముత్యాలు, ఊలు డిజైన్లు వేలాడుతూ మ్యాచింగ్‌కు కొత్త అర్థం చెబుతున్నాయి. అంతేకాదు, ప్రత్యేక సందర్భాల్లో ధరించడానికి పూల డిజైన్లతో కఫ్‌ బ్రాస్‌లెట్స్‌తోపాటు జీన్స్‌కు జోడీగా వస్తున్న వాటికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి