తన కష్టాన్ని మరచి సేవ
close
Published : 17/06/2021 01:39 IST

తన కష్టాన్ని మరచి సేవ

సాయం చేయాలన్న మనసు ఉండాలే కానీ... పేదరికం, అనారోగ్యం ఏవీ ఆటంకాలు కావని నిరూపిస్తోంది రోజీ సల్దానా...

రోజీ సల్దానా కుటుంబం ముంబయిలోని మలావి చర్చ్‌ ప్రాంతంలో ఉంటోంది. యాభై ఒక్క ఏళ్ల రోజీ సెయింట్‌ జేవియర్‌ స్కూల్లో టీచర్‌. ఆమె భర్త పాస్కల్‌ ఆ దగ్గర్లోనే ఓ పూల దుకాణాన్ని నిర్వహిస్తుంటాడు. పెళ్లిళ్లు, స్కూల్లో వార్షికోత్సవాలకు పూలతో డెకరేషన్లు చేస్తుంటాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఆ అందమైన కుటుంబాన్ని చూసి దేవుడికి కన్నుకుట్టిందేమో.. వారి సంతోషాలకు అడ్డుకట్ట వేశాడు. ఆమె మూత్రపిండాల సమస్యతో బాధపడటం మొదలైంది అయిదేళ్ల కిందటి నుంచే. సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు చుట్టుముట్టాయి. రోజీకి డయాలసిస్‌ చేయిస్తేగాని బతకని పరిస్థితి. ‘ఏడాదిగా డయాలసిస్‌ చేయించుకుంటున్నా. 68  కిలోల నా బరువు 28కి పడిపోయింది. మంచానికే పరిమితమైపోయా. లేచి నాలుగడుగులు వేస్తే ఆ రోజు నరకమే. నాడి కొట్టుకోవడం తగ్గిపోయి కింద పడిపోయేదాన్ని. రోగనిరోధకతా తగ్గిపోయింది. దాంతో రకరకాల అనారోగ్యాలు చుట్టు ముట్టాయి. ఎన్నోసార్లు పక్షవాతం పలకరించింది. రక్తం గడ్డకట్టుకు పోవడంతో కొన్నాళ్లు కోమాలో ఉండిపోయా. మావారు, పిల్లలు నన్ను కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టారు. నాకు కావాల్సిన అత్యవసర వైద్య పరికరాలు, మందులు, అన్నింటినీ అందుబాటులో పెట్టే వారు. అలానే శ్వాస అందక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆక్సిజన్‌ సిలిండర్లను తెచ్చిపెట్టారు’ అని వివరించింది రోజీ. ఇంతగా అనారోగ్యం బాధిస్తున్నా ఆమె మనసు మాత్రం ఎప్పుడూ పేదలకు, అవసరమైన వారికి సాయం చేయాలని ఆశపడేది. ప్రస్తుతం కొవిడ్‌ కోరలు చాస్తోంది. దాని ధాటికి తట్టుకోలేక చాలామంది ప్రాణాలు వదులుతున్నారు. ఊపిరి అందక ఎందరి ప్రాణాలో పోతున్నాయి. అలాంటి వారికి సాయం చేయాలనుకుందామె. భర్తకు తెలిసిన వారు ఆక్సిజన్‌ సిలిండర్‌లు కావాలని అడిగితే తన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా అడగ్గానే వాటిని వారికి అందజేసింది. అప్పుడే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. తను ఈ జబ్బుతో ఎన్నాళ్లో బతకదు. ఉన్నన్ని రోజుల్లో వీలైనంత మందికి సాయం చేయాలనుకుంది. ముఖ్యంగా కొవిడ్‌తో బాధపడుతోన్న వారికి అండగా నిలవాలనుకుంది. తన నగలను అమ్మి వచ్చిన ఎనభై వేల రూపాయలతో ఆక్సిజన్‌ సిలిండర్‌లను కొనుగోలు చేయించింది. వీటిలో ఆక్సిజన్‌ను నింపి కావాల్సిన వారికి అందించే బాధ్యతను భర్త, పిల్లలకు అప్పజెప్పింది. అప్పటి నుంచి వారు దీన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.
ఆమెకు ఇప్పటికీ వైద్యానికీ, మందులకూ బాగానే ఖర్చవుతుంది. అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె కడసారి కోరిక తీర్చాలని కుటుంబ సభ్యులు... ఇలా కొవిడ్‌ రోగులకు సాయం చేస్తున్నారు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి