ఉల్లిపొట్టు పడేయకండి!
close
Updated : 19/06/2021 01:12 IST

ఉల్లిపొట్టు పడేయకండి!

మామూలుగా ఉల్లిపొట్టును చెత్తలో పడేస్తాం. కానీ దానివల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుంటే ఇకపై భద్రంగా ఉంచుతాం.

డిగిన ఉల్లిపొట్టును సన్నటి సెగమీద పావుగంట ఉడికించి, వడకట్టి ఆ నీటిని పడుకోబోయే ముందు తాగితే హాయిగా నిద్రపడుతుంది. కాళ్లు తిమ్మిరెక్కడం తగ్గుతుంది.
ఉల్లిపొట్టును కుక్కర్‌లో ఉడికించి వడకట్టి ఆ నీటిని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలంటుకుంటే కురులు దృఢంగా ఉంటాయి. తరచూ ఇలా చేస్తే రాగిరంగు డై వేసుకున్నట్టు మారుతుంది కూడా.
ఉల్లిపొట్టుని మొక్కల్లో వేస్తే ఎరువుగా ఉపయోగపడుతుంది. దీన్ని డబ్బాలో వేసి నీళ్లు పోసి మూతపెట్టి ఏడు రోజుల తర్వాత ఆ నీటిని మొక్కలకు జల్లితే తెగుళ్లు సోకవు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని