కుండల్లో  వండేద్దామా...
close
Updated : 22/06/2021 04:55 IST

కుండల్లో  వండేద్దామా...

అమ్మమ్మలు, నాన్నమ్మలు అన్నీ మట్టిపాత్రల్లోనే వండేవాళ్లు. స్టీలు సామాన్లొచ్చి వంటింటిని ఆక్రమించేశాయి. చరిత్ర పునరావృతమవుతుంది అన్నట్టు ఇప్పుడు మళ్లీ వీటిల్లో వండేందుకు సిద్ధపడుతున్నారు కొందరు. ఆ లాభాలేంటో మనమూ చూద్దామా!

ప్రకృతిలోంచి వచ్చిన మట్టిలో బి12తో సహా అనేక విటమిన్లు ఉంటాయి. కాయగూరల్లోని పోషకాలేవీ వృథా పోవు. పాత్ర నిండా ఆవిరి పరచుకుని, దానితోనే మగ్గుతుంది కనుక ఆరోగ్యానికి మంచిది. పైగా రుచి కూడా అధికం.

మట్టిపాత్ర త్వరగా వేడెక్కుతుంది.. పదార్థాలూ త్వరగా ఉడుకుతాయి. వీటిల్లో ఎక్కువ సమయం తీసుకునే కందిపప్పు, దొండ కాయ లాంటివే కాదు మాంసాహారాలు సైతం వేగంగా, రుచిగా వండుకోవచ్చు. సమయం, ఇంధనం కలిసొస్తాయి. ఆహారమూ చాలా సేపు వేడిగా ఉంటుంది కాబట్టి మళ్లీ మళ్లీ వేడి చేయనవసరం లేదు. అందువల్ల పోషకాలు ఆవిరైపోవు.

ఈ పాత్రల్లో వంటకు నూనె పెద్దగా అవసరం ఉండదు. దీనివల్ల ఒంట్లో కొవ్వు చేరదు. మట్టి పాత్రలు త్వరగా పగిలిపోతాయనే భయం అవసరం లేదు. వీటిని అమర్చే విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలాకాలం మన్నుతాయి.

జాగ్రత్తలు ఇలా...

ఒకేసారి ఎక్కువ మంటపెడితే పగిలే అవకాశం వుంది. కనుక సెగ నెమ్మది నెమ్మదిగా పెంచాలి.

వీటిని సబ్బుతో శుభ్రపరిస్తే దాన్ని పీల్చుకుంటాయి. కనుక సున్నిపిండి, వేడినీళ్లతో కడగటం ఉత్తమం.

అతి శీతలం నుంచి అతి ఉష్ణానికి మారిస్తే వీటికి పగుళ్లు రావచ్చు. కనుక అంత తేడా లేకుండా చూడాలి.

మట్టి పాత్రలు అనగానే కట్టెల పొయ్యి మీదే వాడాలి కాబోలు అనిపిస్తుంది. కానీ గ్యాస్‌ పొయ్యి మీద కూడా ఈ పాత్రలతో నిరభ్యంతరంగా వండుకోవచ్చు. అందుకు అనువుగా పట్టుకోవడానికి హ్యాండిల్‌తో సహా వాటిని రూపొందిస్తున్నారు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి