సహోద్యోగులతో కలిసిపోయేదెలా?
close
Published : 22/06/2021 01:32 IST

సహోద్యోగులతో కలిసిపోయేదెలా?

కొత్తగా ఉద్యోగంలో చేరాను. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఎలా, ఎంతవరకూ కొనసాగించాలి? ఆఫీసు విధులను ఎలా సమన్వయం చేసుకోవాలి?

- ఓ సోదరి

కొత్తగా ఉద్యోగంలో చేరినపుడు ఆరోగ్యకరమైన, వాస్తవిక అంచనాలను ఏర్పరచుకోవాలి. బృంద సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. మొదట్లో మెప్పు పొందాలని చాలామంది ప్రతి పనినీ స్వీకరిస్తారు. మంచిదే.. కానీ కొన్ని నియమాలను పెట్టుకోండి. బృందానికి సాయాన్ని అందించడంలో ముందుకు రావడంతోపాటు మీ సమయం, శక్తి సామర్థ్యాలకు తగిన విలువ దక్కుతోందో లేదో కూడా చూసుకోవాలి. దీన్ని మొదట్నుంచే అమలు చేసుకోవాలి. వర్క్‌ ఫ్రం హోం విధానంలో యాజమాన్యాలు ఉద్యోగులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నాయి. కానీ మహిళలకు ఇల్లు, పిల్లల బాధ్యతల వంటివీ ఉంటాయి. మీ అందుబాటు గురించి స్పష్టతనివ్వాలి. ఉదాహరణకు- ఉదయం 8లోపు ఇంట్లో పనులుంటాయనో, రాత్రి 7 గం. తర్వాత ఫలానా పనులుంటాయి అనో చెప్పొచ్చు. అందుబాటులో ఉండలేని తేదీలనూ ముందుగానే చెప్పాలి. లేదంటే అత్యవసర పని ఎదురై, తీరా మీరు చేయలేని స్థితిలో ఉండి చేయకపోతే మీపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. అలాగే సమయాల పట్ల ఖరాఖండీగానూ ఉండొద్దు. వీలున్నపుడు పని అందుకునేలానూ ఉండాలి.

సంస్థ, తోటివారు మీనుంచి ఏం ఆశిస్తున్నారో కూడా గమనించుకోండి. ఉదాహరణకు ఒక పని గంటలో అవుతుందనుకున్నారు అనుకుందాం. ఆలోగా చేయడానికి ప్రయత్నించండి. మీ చేతిలో తగినంత పని ఉండి, వేరేది అందుకోలేకపోతే దాన్నీ మీద వేసుకోకండి. వేరే వాళ్లకి ఇవ్వండి. వ్యక్తిగత పని కంటే బృందంతో చేయగలిగే వారికే ప్రాధాన్యం ఉంటుందని గుర్తుంచుకోండి. మీకు అనుకూలంగా ఒక్కసారిగా అందరూ పని విధానాన్ని మార్చుకుంటారనుకోవద్దు. వాళ్లూ మీపై కొన్ని అంచనాలతో ఉంటారు. వాటి గురించి తెలుసుకోండి. కొందరికి అదనపు సమయం పని చేయడం, వారాంతాల్లోనూ పని చేయడం సమంజసంగా తోచొచ్చు. మీకవి అసమంజసంగా అనిపించొచ్చు. వీటి గురించీ ముందుగానే చర్చించుకోవాలి. ఇలా పరస్పరం చర్చించుకోవడం ద్వారా మీరు కోరుకున్న సరిహద్దులను ఏర్పరచుకోగలుగుతారు. ఒక్కోసారి కొందరు వాటిని ఉల్లంఘించొచ్చు. చాలాసార్లు జరుగుతుంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి. లేదంటే వేరొకరు వాటిని నిర్ణయిస్తారు. అది ఎప్పుడూ మంచిది కాదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి