అంతరిక్షంలోకి.. టిక్‌టాకర్‌
close
Published : 23/06/2021 01:28 IST

అంతరిక్షంలోకి.. టిక్‌టాకర్‌

అంతరిక్షం అనగానే వ్యోమగాములు గుర్తొస్తారు. సామాన్యులకు వాళ్లని చూడటమే ఒక అబ్బురం. కానీ.. కెల్లీ గెరార్డి అనే టిక్‌టాకర్‌కు ఏకంగా స్పేస్‌షిప్‌లో ప్రయాణించే అవకాశమొచ్చింది. అదెలా సాధ్యమైందంటే..!!
వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌ టూరిజం సంస్థ. వచ్చే ఏడాది నుంచి మనుషుల అంతరిక్ష పర్యాటకానికి కృషి చేస్తోంది. ఈ దిశగా పరిశోధనలు చేయనున్నారు. అందుకే కెల్లీ గెరార్డిని ఎంపిక చేశారు. ఈమె ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఆస్ట్రోనాటికల్‌ సైన్సెస్‌ (ఐఐఏఎస్‌)లో పరిశోధకురాలు. ఆస్ట్రోనాటిక్స్‌, స్టెమ్‌ అంశాలతోపాటు తల్లిగా తన అనుభవాలను టిక్‌టాక్‌, ఇన్‌స్టాలలో పంచుకుంటూ ఉంటుంది. తనకు అక్కడ ఒక్కోదానిలో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. స్పేస్‌ టూరిజంపై ఆసక్తి, కొంత ఫాలోయింగ్‌ ఉండటంతో ఈమెను ఎంచుకున్నారు.
కెల్లీ కేవలం వెళ్లి రావడానికే పరిమితం కాదు. మానవ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సాంకేతికతలను తన మీద పరీక్షిస్తారు. సున్నా గ్రావిటీలో ల్యాండింగ్‌, టేకాఫ్‌ సమయాల్లో శరీరంలో, శరీర బరువులో మార్పులకు సంబంధించి బయోమెట్రిక్‌ డేటాను సేకరిస్తారు. ఇది దాదాపుగా 60 నుంచి 75 నిమిషాలపాటు సాగుతుంది. వీటి ఆధారంగా పర్యటక స్పేస్‌ ఫ్లైట్లను మరింత ఆధునీకరిస్తారు.
32ఏళ్ల కెల్లీ స్పేస్‌ స్టేషన్‌లో శిక్షణను ముందుగానే తీసుకుంది. ‘ఇప్పటివరకూ చాలా తక్కువ మందే అంతరిక్షంలో అడుగుపెట్టారు. వారిలో మహిళలు 100 మంది కన్నా తక్కువే. ఇక అమ్మల సంఖ్యను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఇప్పుడు నేనూ వారి జాబితాలో చేరడం నా మూడేళ్ల కూతురు చూస్తుంది. చాలా కష్టమనుకునే పనేదైనా  కొద్దిగా శ్రమపడితే చేయడం సులువని తను తెలుసుకుంటుంది’ అంటోంది కెల్లీ. ఈ పరిశోధనకు ఒప్పుకోవడం ద్వారా తనలా మరెందరో పరిశోధకులకు అవకాశాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి