బీరువా వాసన!
close
Published : 24/06/2021 01:27 IST

బీరువా వాసన!

ఈ కాలంలో దుస్తులు త్వరగా ఆరవు. ఎండ తగ్గి, గాలి చేరక... గదులూ ఓ రకమైన వాసనతో ఉంటాయి. ఇక బీరువాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలాంటప్పుడు...

వైట్‌ వెనిగర్‌ గదుల్లో స్ప్రేచేస్తే దుర్వాసన ఉండదు.

* బ్యాగులు కొన్నప్పుడు ఇచ్చే సిలికా జెల్‌ సాచెట్లను బీరువాల్లో పెడితే... వాసనల్ని పీల్చేసుకుంటాయి. సిల్వర్‌ ఫిష్‌ల సమస్యా రాదు.

* దుస్తులు సరిగా ఆరనప్పుడు... డ్రైయర్‌తో ఓ సారి ఆరబెట్టండి. అప్పటికీ తేమ పోకపోతే... ఫ్యాను గాలికైనా పూర్తిగా ఆరాక నాఫ్తలిన్‌ గోళీలను ఉంచండి. ఆ వాసన పడని వారు.. కాస్త వంటసోడాను చిన్న వస్త్రంలో మూటకట్టి దుస్తుల మధ్య ఉంచితే సరి.

* నిమ్మగడ్డి, కాస్త రోజ్‌ వాటర్‌ నీళ్లల్లో వేసి మరిగించండి. ఆ సువాసనలు గదులంతా వ్యాపిస్తాయి. తేమతో వచ్చే ముక్కవాసన రాదు.

* బూట్లని అరల్లో దాచి పెట్టేటప్పుడు పాత కాగితాలని ఉండల్లా చుట్టి.. వాటిలో కుక్కితే చెడు వాసన రాదు.

* బట్టలు దాచిపెట్టే బీరువాల్లో, చెప్పుల్లో నాలుగైదు సుద్దముక్కలు వేసి ఉంచితే అవి తేమను పీల్చుకుని బట్టలు ముక్కవాసన రాకుండా చూస్తాయి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి