రొమ్ముల్లో నొప్పి తగ్గట్లేదు.. ఏం చేయాలి? - gynecologist advice on breast pain in telugu
close
Published : 14/07/2021 15:40 IST

రొమ్ముల్లో నొప్పి తగ్గట్లేదు.. ఏం చేయాలి?

హాయ్‌ డాక్టర్‌. నాకు రెండు రొమ్ములూ నొప్పిగా ఉంటున్నాయి. ప్రస్తుతం మందులు వాడుతున్నా సమస్య తగ్గట్లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? నొప్పి తగ్గడానికి పరిష్కారం చెప్పగలరు.

- ఓ సోదరి

జ: రొమ్ముల్లో నొప్పి ఉందన్నారు.. అయితే మీ వయసు కానీ, మీ నొప్పి గురించి ఇతర వివరాలు కానీ లేదా మీకు పాలు తాగే పిల్లలు ఉన్నారా అన్న విషయాలేవీ రాయలేదు. ఈ నొప్పి అనేది నిరంతరాయంగా ఉంటుందా లేదంటే నెలసరికి ముందు మాత్రమే వస్తుందా? అనేది పరిశీలించుకొని.. ఒకసారి గైనకాలజిస్ట్‌తో పరీక్ష చేయించుకోవాలి. అలాగే అవసరమైతే సోనోమామోగ్రఫీ చేయించుకుంటే నొప్పికి కారణం తెలియచ్చు. సాధారణమైన నొప్పి అయితే పెయిన్‌ కిల్లర్స్‌, కొన్ని రకాల విటమిన్‌ సప్లిమెంట్స్‌ వాడితే తగ్గుతుంది. హార్మోన్లకు సంబంధించిందైతే హార్మోన్‌ మాత్రలు వాడాల్సి ఉంటుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని