పైల్స్‌ సమస్య ఉంది.. పరిష్కారమేమిటి?  - gynecologist advice on piles problem
close
Updated : 18/06/2021 20:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పైల్స్‌ సమస్య ఉంది.. పరిష్కారమేమిటి? 

నమస్తే డాక్టర్‌. నా వయసు 33. నాకు పైల్స్‌ సమస్య ఉంది. ప్రస్తుతం అవి పెరుగుతూ నొప్పి వస్తున్నాయి. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? దీనికి పరిష్కార మార్గాలేంటో దయచేసి చెప్పండి.

- ఓ సోదరి

జ: పైల్స్‌ అనేవి ఉబ్బిన రక్తనాళాలు (Veins). ఏదైనా ఒత్తిడి పెరిగినప్పుడు, లేదా రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడినప్పుడు రక్తనాళాల్లో వాపు ఏర్పడవచ్చు. మలద్వారం వద్ద ఈ వాపు ఏర్పడినప్పుడు దాన్ని ‘పైల్స్’ అంటారు. స్త్రీలలో ముఖ్యంగా ఇవి గర్భవతిగా ఉన్నప్పుడు మొదలై తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తాయి. ఎందుకంటే గర్భవతిగా ఉన్నప్పుడు పొట్టలో ఒత్తిడి ఎక్కువవడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మలబద్ధకం ఉన్నా.. మల విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి ఉపయోగించినా, బరువు ఎక్కువగా ఉన్నా ఈ పైల్స్ ఎక్కువగా పెరగడానికి కారణాలవుతాయి. ప్రారంభ దశలో ఉన్నప్పుడు మలబద్ధకం లేకుండా ఉండడానికి ఆహార నియమాలు పాటించడం, స్టూల్‌ సాఫ్ట్‌నర్స్‌ వాడడం, రక్తనాళాల్లో వాపు తగ్గడానికి ఆ భాగంలో ఆయింట్‌మెంట్స్‌ వాడడం.. వంటివి చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. మరీ ఎక్కువగా ఉంటే ఆపరేషన్‌ ఒక్కటే మార్గం.


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని