వైట్‌ డిశ్చార్జికి అదే కారణమా? - gynecologist advice on white discharge and thyroid problem
close
Published : 24/11/2021 20:08 IST

వైట్‌ డిశ్చార్జికి అదే కారణమా?

మేడమ్.. నాకు థైరాయిడ్‌ ఉంది. వైట్‌ డిశ్చార్జి అవుతోంది. వెజైనా దగ్గర మంట, దురద కూడా వస్తోంది.. ఈ సమస్యలకు పరిష్కారమేంటో చెప్పండి. - ఓ సోదరి

జ: థైరాయిడ్‌ ఉందని రాశారు కానీ దాని స్థాయులు ఎలా ఉన్నాయో రాయలేదు. ఏదైనా కూడా తగిన మందులు వాడుతుంటే అదుపులోకి వస్తుంది. దీనికోసం ఎండోక్రైనాలజిస్ట్‌ని సంప్రదిస్తే మీ సమస్యను బట్టి తగిన తగిన మందులు సూచిస్తారు. ఇకపోతే దురద, మంటతో కూడిన వైట్‌ డిశ్చార్జికి రకరకాల కారణాలుండచ్చు. బ్యాక్టీరియా, ఫంగస్‌, ట్రైకోమోనాస్ వంటి ఇన్ఫెక్షన్ల వల్ల కావచ్చు లేదా అలర్జీలు, చర్మవ్యాధులు వంటి వాటి వల్ల కూడా కావచ్చు. అందుకే ముందుగా మీరు గైనకాలజిస్ట్‌తో పరీక్షలు చేయించుకుంటే వారు పాప్‌స్మియర్‌, వెజైనల్‌ పీహెచ్‌, కొన్ని రక్త-మూత్ర పరీక్షలు చేయడం ద్వారా దానికి కారణమేంటో నిర్ధారించి తగిన చికిత్స చేస్తారు. ఎందుకంటే పైన పేర్కొన్న వాటికి చికిత్సలు విడివిడిగా ఉంటాయి.


Advertisement


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని