బరువు అదుపులో ఉండాలంటే సొరకాయ తినాల్సిందేట! - health benefits of bottle gourd or sorakaya in telugu
close
Published : 22/06/2021 17:32 IST

బరువు అదుపులో ఉండాలంటే సొరకాయ తినాల్సిందేట!

వేడిని అదుపులో ఉంచడానికి ఇతరత్రా ఎన్ని చర్యలు తీసుకున్నా... తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్త తప్పనిసరి. ఈ కాలంలో పోషకాలను అందిస్తూ... శరీర తాపాన్ని తగ్గించడంలో సొరకాయని మించింది లేదంటారు పోషకాహార నిపుణులు. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా?

* సొరకాయలో క్యాలరీలు చాలా తక్కువ. వంద గ్రాముల కాయ నుంచి శరీరానికి అందేవి 15 క్యాలరీలే. నీరు మాత్రం ౯౬ శాతం ఉంటుంది. వీటిల్లో జీర్ణశక్తికి సహకరించే పీచు పుష్కలంగా దొరుకుతుంది. ఇది అతిగా తినే అలవాటుని తగ్గిస్తుంది. శరీర బరువుని అదుపులో ఉంచుతుంది.

* వేసవిలో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. నీటి నిల్వలు తగ్గి నిస్సత్తువ ఆవరిస్తుంది. ఈ పరిస్థితి తలెత్తకూడదంటే... సొరకాయని తరచూ తింటే మేలు. ఇది అతి దాహం తగ్గిస్తుంది.

* శరీరానికి హాని చేసే శ్యాచురేటెడ్ కొవ్వు, కొలెస్ట్రాల్ ఇందులో ఉండవు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

* ఇనుముతో పాటు ఆనపకాయలో ఉండే విటమిన్ బి, సిలు వ్యాధి నిరోధక శక్తిని పెంచితే దీనిలోని పొటాషియం బీపీ పెరగకుండా కాపాడుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు దీనిని ఆహారంగా తీసుకుంటే మేలు. కొద్ది మొత్తంలో లభించే సూక్ష్మ పోషక ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

 

నోరూరించే సొరకాయ రైతా!

సొరకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చూశారుగా..ఈ క్రమంలో - ఎండాకాలంలో శరీరానికి చలువ చేసే రైతా తయారీ చూద్దాం రండి..

కావాల్సినవి

సొరకాయ తురుము - కప్పు

ఉప్పు - చిటికెడు

పెరుగు - కప్పు

నీళ్లు - కప్పు

కారం - పావు టీస్పూన్

జీలకర్ర పొడి - అర టీస్పూన్

గరం మసాలా - చిటికెడు

నల్ల ఉప్పు - తగినంత

తయారీ

సొరకాయ తురుమును ఒక గిన్నెలోకి తీసుకొని అందులో నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీన్ని వడకట్టి, చేతులతో నీటిని పిండేయాలి. ఇప్పుడు కప్పు పెరుగు తీసుకొని కాస్త గిలక్కొట్టాలి. ఆ తర్వాత దానికి సొరకాయ తురుము, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, నల్ల ఉప్పు కలపాలి. ఆపై ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తర్వాత సర్వ్ చేస్తే సరి.. కావాలనుకుంటే ఇందులో కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు. దీన్ని గరం మసాలాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని