అందుకే రోజూ నెయ్యి తీసుకోవాల్సిందే ! - health benefits of ghee in telugu
close
Published : 28/06/2021 17:33 IST

అందుకే రోజూ నెయ్యి తీసుకోవాల్సిందే !

వేడివేడి అన్నం, పప్పు లేదా ఆవకాయ.. దాంట్లో కాస్త నెయ్యి.. చెబుతుంటేనే నోరూరిపోతోంది కదూ! మరి తింటేనో.. రుచి అదిరిపోవాల్సిందే! బహుశా దీని రుచి తెలియని తెలుగు వారు దాదాపు ఎవరూ ఉండరేమో! మరి దీనికి అంతటి రుచి దేనివల్ల వచ్చిందంటారు..? సందేహమేముంది? అక్షరాలా నెయ్యి వల్లే అంటారా..? అవును మీరన్నది నిజమే. అందుకే భారతీయ సంప్రదాయ వంటకాల్లో, పండగలకు, ప్రత్యేక సందర్భాలకు తయారుచేసే పిండివంటల్లో, వివిధ రకాల స్వీట్ల తయారీలో నెయ్యిని తప్పనిసరిగా వాడతారు. అయితే దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు పెరిగి లావవుతామేమోనని కొందరు, గుండెకు మంచిది కాదని మరికొందరు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తాయని ఇంకొందరు.. ఇలా నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు. కానీ ఎన్నో విటమిన్లు, మరెన్నో ఖనిజాలతో మిళితమైన నెయ్యి వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్యనిపుణులు. అవేంటో తెలుసుకుంటే మనం కూడా నెయ్యిని నిస్సంకోచంగా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

ఏయే పోషకాలుంటాయి?

నెయ్యి వివిధ రకాల పోషకాల సమ్మేళనం. ఇందులోని ఎ, ఇ, డి, కె.. వంటి కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ ఆమ్లాలు, లినోలిక్, బ్యుటిరిక్ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు.. మొదలైన పోషకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. అందుకే పూర్వకాలం నుంచి నెయ్యిని పలు రకాల ఆహార పదార్థాల తయారీలోనే కాకుండా ఆయుర్వేద మందుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు.

మెదడు చురుగ్గా..

శరీరంలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాల స్థాయులు తగ్గిపోవడం వల్ల డిమెన్షియా, అల్జీమర్స్.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి వీటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే.. ఈ రెండు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాంటివాటిలో అతి ముఖ్యమైంది నెయ్యి. ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే ఈ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని నరాల పనితీరును మెరుగుపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. తద్వారా మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి నెయ్యిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో అవసరం.

సులభంగా జీర్ణమవడానికి..

నెయ్యి ఎక్కువగా తీసుకోకండర్రా.. అరగదు..' అనే మాట మనం చాలా సార్లు వింటుంటాం. నిజానికి నెయ్యి తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తీసుకున్న ఆహారం మరింత సులభంగా అరుగుతుందంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. నెయ్యి జీర్ణవ్యవస్థలో కొన్ని రకాల ఆమ్లాలు విడుదలయ్యేలా చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి నెయ్యి తింటే అరగదు అన్న అపోహను తొలగించుకొని దీన్ని రోజూ ఆహారంతో పాటుగా తీసుకుంటే మరీ మంచిది.

గుండెకు మేలు..

చాలామంది నెయ్యిని ప్రాసెస్డ్ ఫుడ్‌గా భావిస్తారు. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల గుండెపోటు, ఇతర హృదయ సంబంధిత సమస్యలు వస్తాయేమోనని భయపడుతుంటారు. కానీ నెయ్యిని రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఇందులో అధిక మొత్తంలో ఉండే కాంజ్యుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ).. అనే ఫ్యాటీ ఆమ్లం క్యాన్సర్ కారకాలైన కార్సినోజెన్లను తగ్గిస్తుంది. అలాగే ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా కూడా రక్షిస్తుంది. తద్వారా గుండె సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా.. సీఎల్ఏ అధిక బరువును తగ్గించడంతో పాటు బరువు పెరగకుండా కూడా కాపాడుతుంది. మీకు మరో విషయం తెలుసా..? నెయ్యిని ఆరు నెలల పాటు తక్కువ మోతాదులో రోజూ తీసుకోవడం వల్ల బరువు అదుపులోకి వస్తుందని ఓ అధ్యయనంలో కూడా వెల్లడైంది. కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా నెయ్యిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి మరి.

పెదాలు మృదువుగా..

నెయ్యి కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలు చేస్తుంది. ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చలికాలంలో చాలామందికి పెదాలు పగిలి.. కొన్ని సందర్భాల్లో రక్తం కూడా వస్తుంటుంది. కాబట్టి ఇలాంటి వారు రాత్రి పడుకొనే ముందు కాస్త నెయ్యిని తీసుకొని దాంతో పెదాలపై కాసేపు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల వాతావరణం ఎంత చల్లగా ఉన్నా.. పెదాలు మాత్రం మృదువుగా మెరుస్తూ ఉంటాయి.

మరిన్ని..

* నెయ్యి వల్ల శరీరంలో అనవసర కొవ్వులు పేరుకుపోతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ నిజానికి ఇది రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులను కరిగించడంలో మరింత చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకు నెయ్యిలో ఉండే అత్యవసర అమైనో ఆమ్లాలే కారణం.

* నెయ్యిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్ డ్యామేజ్‌ని తగ్గించి క్యాన్సర్ రాకుండా కాపాడతాయి.

* అలాగే ఈ పదార్థంలో ఉండే యాంటీవైరల్, యాంటీఫంగల్ గుణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు.. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి కూడా నెయ్యి దివ్యౌషధం అనే చెప్పచ్చు.

* శరీరానికి తక్షణ శక్తిని అందించడానికైనా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికైనా, చర్మంపై ఏర్పడే అలర్జీలను తగ్గించడానికైనా నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. ఇలా పలు రకాల ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
ఎంత తీసుకోవాలి?

నెయ్యి ఆరోగ్యానికి మంచిదన్నారు కదా.. అని మరీ ఎక్కువగా తీసుకుంటే లేనిపోని అనారోగ్యాల్ని కొనితెచ్చుకున్నవారవుతారు. కాబట్టి రోజుకు రెండు టీస్పూన్ల నెయ్యిని తీసుకుంటే అటు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండడంతోపాటు ఇటు దాని నుంచి అన్ని రకాల ప్రయోజనాల్నీ పొందచ్చు. అలాగే గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం.. వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు.. వారి సమస్య స్థాయిని బట్టి నెయ్యి వినియోగాన్ని తగ్గించడం లేదంటే డాక్టర్ సలహా మేరకు ఉపయోగించడం మంచిది. మరి మీరు కూడా ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం.

వంటకాలకు అమోఘమైన రుచిని అందించే నెయ్యి వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నారు కదా! మరి దీనివల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయేమోనన్న భయం నుంచి బయటపడి.. మీరు కూడా ఈ రోజు నుంచి నెయ్యిని ఆహారంలో భాగం చేసుకుంటారు కదూ!! అయితే ఒక్క విషయం.. మిగతా అన్నిటి మాదిరిగానే ఈ రోజుల్లో నెయ్యి కూడా కల్తీ అవుతోంది. ఏది అసలైనదో, నకిలీదో గుర్తించలేకపోతే ఆరోగ్యానికి మంచికన్నా హాని జరిగే అవకాశాలే ఎక్కువ. అందుకే ఈ విషయంలో సంబంధిత నిపుణులను సంప్రదించి వారు సిఫార్సు చేసిన ఉత్పత్తులనే వినియోగించడం శ్రేయస్కరం!

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని