జొన్నలతో ఎన్ని ప్రయోజనాలో! - health benefits of jowar or jonnalu in telugu
close
Published : 22/06/2021 18:06 IST

జొన్నలతో ఎన్ని ప్రయోజనాలో!

అధిక బరువుతో బాధపడేవారు దాన్ని వదిలించుకోవడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు విపరీతమైన వర్కవుట్లు చేస్తే, మరికొందరు అప్పటికప్పుడు ఆహారపు అలవాట్లు మార్చుకుంటారు. ఇంకొందరైతే బరువు తగ్గే క్రమంలో తిండి కూడా మానేస్తుంటారు. అయితే ఇలా నోరు కట్టేసుకుని బరువు తగ్గించుకునే బదులు కొన్ని రకాల చిరుధాన్యాలను డైట్‌లో చేర్చుకోవడం మేలంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రత్యేకించి జొన్నలతో చేసిన వంటకాలను తరచుగా తీసుకోవడం ద్వారా అధిక బరువును వదిలించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు.

వేసవిలో తేలికగా జీర్ణమయ్యేలా!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్నలను ఒక్కో చోట ఒక్కోలా పిలుస్తారు. సాధారణంగా జొన్న రొట్టెలు, జొన్నలతో చేసిన ఇతర వంటకాలు తేలికగానే జీర్ణమవుతాయి. అందుకే సమ్మర్‌ డైట్‌లో వీటిని కచ్చితంగా చేర్చుకోవాలంటారు పోషకాహార నిపుణులు. తద్వారా సులభంగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చని వారు సూచిస్తున్నారు. మరి జొన్నలతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రండి.

బరువు తగ్గాలనుకునే వారికి!

* ఇందులో గ్లూటెన్‌ ఉండదు. కాబట్టి డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఆహారం.

* ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది.

* రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.

* ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి.

* ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, క్యాల్షియం, జింక్‌, విటమిన్‌ బి 3 లాంటి విటమిన్లు, ఖనిజాలు, మైక్రో న్యూట్రియంట్స్‌ లాంటి పోషకాలతో జొన్నలు నిండి ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

* బరువు తగ్గాలనుకునేవారు జొన్నలతో చేసిన వంటకాలు తీసుకోవడం మంచిది.

* జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది.

* మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

* రక్తనాళాల్లో ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్‌) స్థాయులను తగ్గించి, హెచ్‌డీఎల్‌(మంచి కొలెస్ట్రాల్‌) స్థాయులను పెంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

* శరీరంలో ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతుంది.

* రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

 

జొన్న రొట్టెలు

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్నలతో ప్రతి ఒక్కరూ సులభంగా తయారుచేసుకునే వంటకం ఏదంటే... రొట్టెలు అని చెప్పవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌... ఎప్పుడైనా వీటిని తీసుకోవచ్చు. మరి ఆ రొట్టెలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి.

కావాల్సినవి

* జొన్న పిండి- రెండు కప్పులు

* నీళ్లు- సరిపడా

తయారీ విధానం

ఒక గిన్నెలోకి జొన్న పిండిని తీసుకోవాలి. ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని ముద్దలా చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ తరహాలోనే పిండిని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. వీటిని కాటన్‌ క్లాత్‌పై పెట్టి, చేతితో నొక్కుతూ రోటీల్లాగా తయారు చేసుకోవాలి. అనంతరం మీడియం సైజు మంట మీద ఇనుప పెనంపై వేసి కాల్చాలి. అంతే ఆరోగ్యకరమైన జొన్న రొట్టెలు సిద్ధం. ఏదైనా కూర, చట్నీతో కలిపి ఈ రొట్టెలను తీసుకోవచ్చు.

సో.. చూశారుగా.. జొన్నలతో చేసిన వంటకాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో!! మరి మీ డైట్‌లో కూడా దీనిని భాగం చేసుకోండి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని